మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి షాక్ తగిలింది. నియోజకవర్గానికి చెందిన కీలక నేత గంజి చిరంజీవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనమంతరావు తదితరులు చిరంజీవి వైసీపీలో చేరడంలో కీలకంగా వ్యవహరించారు. గంజి చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులను సీఎం జగన్ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ.. సీఎం జగన్ సారథ్యంలో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ఆయా వర్గాలకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతను చూసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వైసీపీ అధిష్టానం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా శిరసావహిస్తానని, పార్టీ గెలుపు కోసం అంకితభావంతో పనిచేస్తానని చిరంజీవి స్పష్టం చేశారు. అలాగే అధిష్టానం నిర్ణయిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కడినుంచైనా సరే పోటీచేస్తానని వెల్లడించారు. టీడీపీలో పెత్తనమంతా ఒక సామాజికవర్గానిదేనని, ఇతర సామాజిక వర్గాల వారికి అక్కడ గౌరవం లేదని చెప్పారు. కాగా నారా లోకేశ్ సన్నిహితుడిగా ముద్రపడ్డ గంజి చిరంజీవి గత కొంతకాలంగా టీడీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో కూడా కీలక బీసీ నేతగా చిరంజీవికి మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఆయన తాజా నిర్ణయం మంగళగిరిలో టీడీపీకి ఒక రకంగా షాక్ లాంటి వార్తే అని చెప్పవచ్చు. ఇక గంజి చిరంజీవి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయిన సంగతి ఇక్కడ గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY