ఈ ఇద్దరిలో ఓటర్ల మనసును గెలిచేదెవరు?

Candidates Contesting In Srikalahasti, Candidates Contesting, Srikalahasti Candidates, YCP, TDP, Janasena, Chandrababu, Jagan, TDP Leaders, Srikalahasti, Voters, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YCP, TDP, Janasena, Chandrababu, Jagan, TDP leaders,Srikalahasti, voters

శ్రీకాళహస్తి  వైఎస్సార్సీపీకి, ప్రతిపక్ష టీడీపీకి హాట్ సీట్‎గా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ వర్సెస్ బొజ్జల సుధీర్ మధ్య డైలాగ్ వార్ రోజురోజుకు పీక్స్‌కు వెళుతోంది. అభివృద్ధిపై సిట్టింగ్ ఎమ్మెల్యే,అధికారపార్టీ అవినీతిపై ప్రతిపక్ష నేత  సాక్షాలతో సిద్ధమంటూ బహిరంగ చర్చకు రెడీ అవుతున్నారు. వీటితోనే సార్వత్రిక ఎన్నికల్లో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంగానే కాదు..రాజకీయంగా కూడా  హాట్ సీటుగానే ఉంటుంది. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి,  టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి మధ్య ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. అభివృద్ధిని సాక్ష్యాలతో చూపించడానికి సిద్ధమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్.. అంతా అవినీతే అన్న ఆరోపణలతో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్‎కు మధ్య రగులుతున్న డైలాగ్ వార్ ఎన్నికల వేళ మరింత అగ్గి రాజేస్తోంది.

ఎన్నికలకు ముందు నుంచే  ఈ నేతలిద్దరి మధ్య వ్యక్తిగత దూషణలు, సెల్ఫీ చాలెంజ్‎లు, ఆరోపణలు, సవాళ్లు, శ్వేత పత్రం డిమాండ్‎లు వినిపించగా..నిన్నటి నుంచి ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ఆ వేడి మరింత రాజుకుంది. లోకల్, నాన్ లోకల్ అన్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఐదేళ్లలో వైఎస్సార్సీపీ అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి ఏంటో బుక్ లెట్‎తో సహా వివరిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.

బొజ్జల కుటుంబం 30 ఏళ్లలో చేసిన అవినీతిని బయట పెడతానని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అభివృద్ధి‎పై శ్వేత పత్రమే కాదు, కలర్ ఫోటోలతో కూడిన బుక్ లెట్ ఇంటింటికి అందచేస్తున్నాని అంటున్నారు.అయితే ఈ 30 ఏళ్లలో బొజ్జల కుటుంబం చేసిన అభివృద్ది మాత్రమే.. ఇప్పటికీ శ్రీకాళహస్తిలో కనిపిస్తోందని  బొజ్జల సుధీర్ కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే అక్రమాలు, ఆస్తులపై చర్చకు  ఎప్పుడైనా సరే తాను సిద్దమని సవాల్ విసురుతున్నారు.

ఇక శ్రీకాళహస్తిలో 2.45 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా.. వారిలో 16.89 శాతం బీసీ సామాజికవర్గానికి చెందిన వన్నెకుల క్షత్రియులు 40,152 మంది ఓటర్లు  ఉన్నారు. ఇక 6 శాతం   యాదవ సామాజిక వర్గానికి చెందిన 10,659 మంది, 9 శాతం  ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన  ఓటర్లు 21,370 మంది , 6.6 శాతం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 15,770 మంది  ఉన్నారు. శ్రీకాళహస్తిలో  బలిజ సామాజికవర్గ ఓటర్లు కూడా కీలకం కాగా వైఎస్సార్సీపీ, టీడీపీ నుంచి బరిలో దిగుతున్న ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =