కరోనా వ్యాక్సినేషన్ లో రికార్డ్, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి

42640 New Covid-19 Cases 1167 Deaths Reported in India in the Last 24 hours, Coronavirus Cases, coronavirus cases india, coronavirus india, coronavirus india live updates, Coronavirus India News LIVE Updates, COVID-19 pandemic in India, India Coronavirus, India Covid-19 Updates, India New COVID 19 Cases, Mango News, New Covid-19 Cases 1167 Deaths Reported in India, total corona cases in india today, Total Corona Positive Cases in India, total corona positive in indiaa in the Last 24 hours

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 20 ఆదివారం నాడు చేపట్టిన మెగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో 13 లక్షల మందికి పైగా (13,72,481) కరోనా వ్యాక్సిన్ వేసి సరికొత్త రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్ లో 12 ,85,394 మందికి మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ వేయగా, 87,087 మందికి రెండో డోసు కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఒకేరోజున 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయడం పట్ల ప్రముఖ నటుడు, మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

“ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య బృందాలు ఒకే రోజులో 13.72 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసి అద్భుతమైన ఘనత సాధించడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రయత్నాలు కరోనా మహమ్మారిని ఓడించడంపై ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపుతాయి. టీం ఏపీ ఇలాగే ముందుకెళ్లాలి. మీకు మరింత శక్తి కలగాలి. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు” అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ