ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించే ఐసెట్-2021 ప్రవేశపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ఐసెట్–2021 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఐసెట్ పరీక్షలో 34,789 (91.27 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్టు మంత్రి పేర్కొన్నారు. అలాగే ఐసెట్ ఫలితాలను https://sche.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
మరోవైపు సెప్టెంబర్ 19న నిర్వహించిన ఈసెట్-2021 ప్రవేశపరీక్ష ఫలితాలను కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఈసెట్ పరీక్షకు 32,318 మంది విద్యార్థులు హాజరు కాగా, 29,904 (92.53 శాతం) మంది ఉత్తీర్ణులయినట్టు పేర్కొన్నారు. ఈసెట్-2021 ఫలితాలను https://sche.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా, బీఎస్సి మాథెమాటిక్స్ విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ /బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటుగా ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ