ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్/ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 29వ తేదీన పాలిసెట్-2022 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 1,31,627 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర ఆర్ధిక, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం ఉదయం విజయవాడలో విడుదల చేశారు. వీరిలో 91.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో బాలురు 90.56 శాతం, బాలికలు 93.96 శాతం ఉన్నారు. విద్యార్థులు ర్యాంకు కార్డులను అధికారిక వెబ్ సైట్ లో https://polycetap.nic.in/ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY