తల్లి హీరాబెన్ 100వ జన్మదినం సందర్భంగా ఆశీస్సులు అందుకున్న ప్రధాని మోదీ

PM Modi Visits and Takes Blessings of His Mother in Gandhinagar on Her 100th Birthday, Modi Visits and Takes Blessings of His Mother in Gandhinagar on Her 100th Birthday, PM Modi Visits and Takes Blessings of His Mother in Gandhinagar, PM Modi Mother 100th Birthday, Blessings of His Mother, PM Modi Takes Blessings of His Mother, PM Modi Visits His Mother in Gandhinagar, PM Modi Mother, PM Modi Mother 100th Birthday, Gandhinagar, 100th Birthday, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Prime Minister Of India Narendra Modi, Mango News, Mango News Telugu,

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ శనివారం తన త‌ల్లి హీరాబెన్‌ ను కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఇది ప్రతి సంవత్సరం జరిగేదే అయినా ఈరోజు హీరాబెన్‌ వందవ పుట్టిన రోజు కావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. 1923, జూన్ 18వ తేదీ నాడు హీరాబెన్ మోదీ జ‌న్మించారు. నేటితో ఆమె 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో గుజరాత్ లోని గాంధీన‌గ‌ర్‌లో నివాసం ఉంటున్న ఆమె వద్దకు వెళ్లిన ప్ర‌ధాని మోదీ, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆపై తల్లి పక్కనే కూర్చుని కొద్దిసేపు ఆమెతో ముచ్చటించారు. ఆమె బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్బంగా మోదీ ట్విట్టర్‌ వేదికగా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

“అమ్మ.. ఇది కేవలం ఒక పదం కాదు. అనేక రకాల భావోద్వేగాలతో కూడుకొన్నది. ఈ రోజు జూన్ 18 నా తల్లి హీరాబా 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రోజు. ఈ జన్మదినోత్సవం రోజున నేను సంతోషంతో తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని ఆలోచనలు రాశాను” అని పేర్కొన్నారు. తన తల్లిని ఒక అద్భుతమైన మహిళగా మోదీ అభివర్ణించారు. ‘‘నా తల్లి చిన్నతనంలోనే ఆమె తల్లిని కోల్పోయింది. తన జీవితంలో ఎన్నో కష్టాలను భరించింది. అయితే ఈ క్రమంలో ఆమె దాని కోసం మరింత దృఢంగా తయారైంది’’అని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా మోదీ చిన్నతనంలో ఉండగా తన తల్లి చేసిన అనేక త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ‘‘మా అమ్మ ఇంటి పనులన్నీ స్వయంగా చేయడమే కాకుండా, మరికొన్ని ఇళ్లలో కూడా పాత్రలు కడగేది. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆమె నిరంతరాయంగా పని చేసేది” అని తన చిన్ననాటి రోజులను ప్ర‌ధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − twelve =