ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుదవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మూడు యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు (వీసీ) కలిశారు. ఏపీలో మూడు యూనివర్శిటీలకు కొత్త వైస్ చాన్స్‌లర్లు నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన వైస్ చాన్స్‌లర్లు సీఎం వైఎస్ జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
కడప డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ వీసీ బానోత్ ఆంజనేయ ప్రసాద్, విజయనగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) గురజాడ వీసీ కె.వెంకట సుబ్బయ్య, ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్శిటీ వీసీ మారెడ్డి అంజిరెడ్డిలు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల అభివృద్ధి, పలు సంబంధిత అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తుంది. సీఎంతో జరిగిన వీసీల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE