ఇకపై సాయంత్రం 5 గంటల వరకు స్టాక్‌ మార్కెట్లు.. త్వరలో ప్రకటించనున్న మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ?

Stock Market Trading Hours For Interest Rate Derivatives Likely To be Extended Till 5 pm by Sebi,Stock Market Trading Hours,Interest Rate Derivatives,Likely To be Extended Till 5 pm,Sebi Latest News and Updates,Mango News,Mango News Telugu,Sebi Guidelines For Stock Market,Sebi Full Form,Sebi Established,Sebi Wikipedia,Functions Of Sebi,Sebi Chairman,7 Stock Exchanges In India,Sebi Headquarters,Stock Exchange Board Of India,List Of 24 Stock Exchanges In India,Stock Market Sebi New Rules,Stock Market Sebi Rules,Stock Market Sebi Turnover Fees

దేశీయ స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ పని గంటలు పెరగునున్నాయి. ఇకపై సాయంత్రం 5 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగేలా మార్కెట్‌ రెగ్యులేటర్‌ ‘సెబీ’ ఈ మేరకు యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా సెబీ ముందుగా మార్కెట్‌ భాగస్వాములతో ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) మరియు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) రెండింటిలో ట్రేడింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2018లోనే సెబీ ట్రేడింగ్‌ సమయం పొడిగింపు కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. కానీ దీనిపై తుది నిర్ణయం మాత్రం ఇంతవరకూ తీసుకోలేకపోయింది. ఇక ట్రేడింగ్‌లో ఏదైనా అంతరాయం ఏర్పడితే షేర్ హోల్డర్లకు 15 నిమిషాల్లోగా తెలియజేయాలని గత నెల స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సెబీ సూచించింది.

ఈ క్రమంలో ట్రేడింగ్‌ సమయాన్ని మరో గంటన్నరపాటు పెంచాలని కూడా ఎక్సేంజ్‌లను కోరింది. దీని అమలుకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ)ను కూడా ఏర్పాటు చేసింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఆమోదం తెలిపితే ఈ మార్పు రేపటి నుంచే (ఫిబ్రవరి 23) నుంచి అమల్లోకి రానుంది. కాగా ఇది అమలులోకి వస్తే, మార్కెట్ల ట్రేడింగ్‌ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3:30 గంటల మధ్య వర్తకం చేయబడతాయి. అయితే వడ్డీ రేటు డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ట్రేడింగ్ గంటలలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని తెలుస్తోంది. ఇక ఫైనల్ సెటిల్‌మెంట్ ప్రైస్ కంప్యూటేషన్ మెకానిజం మరియు అలాగే సీపీ కోడ్ సవరణలో కూడా ఎటువంటి మార్పు ఉండదని కూడా సెబీ తెలిపినట్లు సమాచారం. ఇక దీని ప్రకారం.. ఫిబ్రవరి 23 తర్వాత ఇప్పటికే ఉన్న అన్ని ఎక్స్‌పైరీ ఒప్పందాలు మరియు ఆ తర్వాత ప్రవేశపెట్టిన అన్ని కొత్త గడువు ఒప్పందాలు సాయంత్రం 5.00 గంటల వరకు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచబడతాయని సెబీ స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =