ఏపీలో తొమ్మిదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం

AP Free Ration Distribution, Free Ration Distribution, Ninth Phase Free Ration Distribution, Ninth Phase Free Ration Distribution In AP, Ninth Phase Free Ration Distribution In AP Started

కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఎత్తివేశాక కూడా పేదలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఉచితంగా రేషన్ పంపిణీని ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ఎనిమిది విడతల్లో ఉచిత రేషన్ అందించగా, ఈ రోజు (ఆగస్టు 4, మంగళవారం) నుంచి ఏపీలో తొమ్మిదో విడత ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభం అయింది.

రేషన్ కార్డులో నమోదైన ఒక్కో మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కుటుంబానికి కేజీ కందిపప్పు అందించనున్నారు. అయితే పంచదారకు మాత్రం లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉచిత రేషన్ పంపిణీ ద్వారా రాష్ట్రంలో మొత్తం 1.49 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రేషన్ షాపుల వద్ద శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని రేషన్ డీలర్లకు పౌరసరఫరాల శాఖ ఆదేశాలు ఇచ్చింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu