తెలంగాణలో 5 లక్షలు దాటిన కరోనా పరీక్షలు, 49,675 మంది డిశ్చార్జ్

Telangana Corona Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 3, సోమవారం నాటికీ 5,01,025 కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం నాడు 13,787 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా 49,675 కి చేరడంతో రికవరీ శాతం 72 శాతంగా నమోదైంది. మరోవైపు కొత్తగా 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 68,946 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.

తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డిలో 121, కరీంనగర్‌ లో 101, మేడ్చల్ లో 72, వరంగల్ అర్బన్‌లో 63, నిజామాబాద్ లో 59, జోగులాంబ గద్వాల్ లో 55, ఖమ్మంలో 41, మహబూబ్ నగర్ లో 39, భద్రాద్రి కొత్తగూడెంలో 38, నాగర్ కర్నూల్ లో 29, నల్గొండలో 29, పెద్దపల్లిలో 29, మహబూబాబాద్ లో 27, సూర్యాపేటలో 23, జగిత్యాలలో 22, మంచిర్యాలలో 21 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 3, రాత్రి 8 గంటల వరకు) :
  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 5,01,025
  • రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 68,946
  • కొత్తగా నమోదైన కేసులు : 1286
  • నమోదైన మరణాలు : 12
  • డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 49,675
  • కరోనా రికవరీ రేటు: 72%
  • యాక్టీవ్ కేసులు : 18,708
  • హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 11,935
  • మొత్తం మరణాల సంఖ్య : 563
  • కరోనా మరణాల రేటు: 0.81%

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =