ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు.. సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

AP Supreme Court Collegium Recommends Appointment of Seven New Judges For High Court, Supreme Court Collegium Recommends Appointment of Seven New Judges For High Court, SC Collegium Recommends Appointment of Seven New Judges For High Court, Seven New Judges For High Court, High Court New Judges, SC Collegium Recommends Appointment Of New High Court New Judges, AP Supreme Court Collegium, SC Collegium, AP High Court New Judges, Supreme Court Collegium recommends appointment of seven judicial officers as judges of Andhra Pradesh High Court, seven judicial officers as judges of Andhra Pradesh High Court, judges of Andhra Pradesh High Court, seven judicial officers as judges, AP High Court New Judges News, AP High Court New Judges Latest News, AP High Court New Judges Latest Updates, AP High Court New Judges Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమించారు. ఈ మేరకు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం బుధవారం ఏడుగురు న్యాయాధికారులకు హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించారు. దీనిలో భాగంగా అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపా సాగర్‌, బండారు శ్యామ్‌ సుందర్‌, ఊటూకూరు శ్రీనివాస్‌, బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలను జడ్జీలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

కాగా కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే మరో నాలుగు రోజుల్లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ పదవీకాలం ముగియనుండటంతో ఈ లోపే నిర్ణయం ఉంటుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక దీనికి ముందు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఫిబ్రవరి నెలలో కూడా ఏడుగురు న్యాయమూర్తులను నియమించిన సంగతి తెలిసిందే. అప్పుడు సి. రవి, వి. సుజాత, కె. శ్రీనివాస రెడ్డి, జి రామకృష్ణ ప్రసాద్‌, ఎన్‌ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్‌ రావు, ఎస్‌ సుబ్బారెడ్డిలను నూతన న్యాయమూర్తులుగా నియమించారు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో జనవరి 29న జరిగిన కొలిజీయం భేటీలో ఈ జడ్జీలను సిఫార్సు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 5 =