సీఎం జగన్ బస్సు యాత్రపై ఆగని కామెంట్లు

Non-Stop Comments On CM Jagan's Bus Trip, YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, CM Jagan's Bus Trip, CM Jagan, Siddam, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
YCP, TDP, Janasena, Chandrababu, Jagan, Pawan Kalyan, CM Jagan's bus trip

ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌లో దోచుకున్న‌ది స‌రిపోక‌.. మ‌రో ఐదేళ్లు దోచుకోవ‌డానికి సిద్ధ‌మంటూ వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొత్తం బ‌స్సు యాత్ర చేస్తున్నారా అన్న కౌంటర్లు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వైసీపీ పాల‌న‌లో ప్ర‌జ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డితే.. జ‌గ‌న్ కుటుంబం, వైసీపీ ప‌రివారం వంద‌ల కోట్ల రూపాయిల ప్ర‌జాధ‌నాన్ని దోచుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్ర‌మ మైనింగ్‌ల‌ను ప్రోత్స‌హించింది. మ‌ద్యం కాంట్రాక్ట్‌లు పొంది.. ధ‌ర‌లు పెంచి నాణ్య‌త లేని లిక్క‌ర్ స‌ర‌ఫ‌రాతో ప్ర‌జ‌ల సొమ్మును దోచుకుంది వైసీపీ ప్ర‌భుత్వం కాదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గోదావ‌రి, కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతంలోని ఇసుక దందాకు తెర‌లేపి కోట్ల రూపాయిల‌ను వైసీపీ నాయ‌కులు దోచేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు అమ‌రావ‌తి రాజ‌ధానికి మ‌ద్ద‌తు ప‌లికిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానులు అంటూ మాటని మార్చారనే వాదన ఏపీలో బలంగా వినిపిస్తోంది. నిజానికి విశాఖ‌ప‌ట్ట‌ణంలోని భూముల‌పై జ‌గ‌న్ క‌న్నుప‌డిందని.. ఆ ప్రాంతంలో భూములు దోచుకుని, అమ్ముకోవ‌డానికి మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌పైకి తెచ్చారని ఏపీ వాసులు ఆరోపిస్తున్నారు. మ‌రో ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుని.. ఇక్క‌డి ప్ర‌జ‌లపై అప్పుల భారం మోప‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ దోచుకోవ‌డానికి మ‌రో అవ‌కాశం ఇవ్వాలంటూ సిద్ధం యాత్ర చేస్తున్నారంటూ కౌంటర్లు వేస్తున్నారు.

పేద ప్ర‌జ‌ల‌కు భూముల పంపిణీ పేరుతో కోట్ల రూపాయిల ప్ర‌జా సంప‌ద‌ను వైసీపీ ప్ర‌భుత్వం దోచేసింది నిజం కాదా అని ఏపీ వాసులు నిలదీస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు పంచడానికి ప్ర‌భుత్వం వ‌ద్ద భూములు లేవ‌ని, ప్ర‌యివేట్ వ్య‌క్తుల వ‌ద్ద భూములు కొన్నామంటూ.. మార్కెట్ ధ‌రను పెంచి అధిక మొత్తం చెల్లించి ఈ భూముల‌ను కొనుగోలు చేసింది. దీంతో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల పంపిణీ పేరుతో వేల కోట్ల రూపాయిల‌ను వైసీపీ నాయ‌కులు లూటీ చేశారని గుర్తు చేస్తున్నారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చేసిన అభివృద్ధి ప‌నులు త‌క్కువ‌ అయినా.. కొద్దోగొప్పో చేసినా వాటిలో వైసీపీ నాయ‌కులు ప‌ర్సంటేజీల రూపంలో బాగానే తినేసారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఐదేళ్లు దోచుకున్న‌ది చాల‌ద‌న్న‌ట్లు.. మ‌రో ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డానికి సిద్ధమంటూ యాత్ర‌లు చేస్తున్నారా అని ఏపీ వాసులు ప్రశ్నిస్తున్నారు. చివరకు బస్సు యాత్రను కూడా సెంటిమెంట్ పండించడానికి గులకరాయి దాడి డ్రామాలు ఆడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. జ‌గ‌న్ మాయ మాట‌లు న‌మ్మి ఓట‌ర్లు మ‌రోసారి వైసీపీ అవ‌కాశం ఇస్తే రాష్ట్ర‌ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు అంధ‌కారంలో ప‌డిపోతుందని హెచ్చరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY