ఏపీలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేష‌న్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్

AP SEC Issues Notification For Stalled Local Body Elections in The State, SEC Issues Notification For Stalled Local Body Elections in The State, Andhra Pradesh State Election Commission Issues Notification For Stalled Local Body Elections in The State, Notification For Stalled Local Body Elections in The State, Andhra Pradesh State Election Commission, State Election Commission, AP State Election Commission, Stalled Local Body Elections in The State, Notification For Stalled Local Body Elections, Local Body Elections, Local Body Elections Notification, Local Body Elections News, Local Body Elections Latest News, Local Body Elections Latest Updates, Local Body Elections Live Updates, AP Local Body Elections, Local Bodies, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో మండల పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీల ఉపసర్పంచ్‌ల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు మే 5వ తేదీన నిర్వహించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌. మండల పరిషత్‌ ఎన్నికలకు గెజిటెడ్‌ స్థాయి అధికారిని, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆర్‌ఐ స్థాయి అధికారిని ఎన్నికల అధికారిగా నియమించాలని దీనిలో పేర్కొన్నారు. మే 1వ తేదీ లోపు ఎన్నికలు జరుగనున్న స్థానిక సంస్థలకు నోటీసులు జారీ చేయాలని తెలిపారు. కాగా మే 5వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని, ఒకవేళ ఏదేని కారణంతో ఆరోజు ఎన్నికలు నిర్వహించలేకపోతే తర్వాతి రోజు మే 6వ తేదీన ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 26 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ల ఎన్నికలు నిర్వహించాలని మరో నోటిఫికేషన్‌ జారీచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =