ఈ సారి అయినా కాలం కలిసి వస్తుందా?

Paritala Sunitha Changing Route.., Changing Route, Sunitha Changing Route, Paritala Sunitha,Rayalaseema, Raptadu, YCP, TDP, Chandrababu, Paritala Sriram, Andhra Pradesh, Andhra Pradesh Elections, AP, AP Elections, AP Live Updates, AP Political News, AP Politics, Mango News, Mango News Telugu
Paritala Sunitha,Rayalaseema, Raptadu, YCP, TDP, Chandrababu, Paritala Sriram,

ఉమ్మడి అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిటాల సునీత ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మొదటి నుంచీ పరిటాల కుటుంబానికి రాయలసీమలో మంచి పేరు ఉంది. అయితే పరిటాల రవి హత్య తరువాత జరిగిన ఎన్నికలలో పరిటాల రవి భార్య సునీతను అక్కడ ప్రజలు గెలిపించారు. 2014లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సునీత.. తర్వాత మంత్రి కూడా అయ్యారు.
సునీత సోదరులైన బాలాజీ , మురళి కూడా నియోజకవర్గాలలోని మండలాల ఇన్చార్జీలుగా పనిచేశారు. అయితే తమ పోస్టులను అడ్డం పెట్టుకున్న సునీత ఇద్దరు సోదరులు అడ్డదారుల్లో డబ్బు సంపాదనకు అలవాటు పడిపోయారట. అక్కడ ఏ పని జరగాలన్నా వీరిద్దరి కనుసన్నల్లో జరగాల్సిందే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. చివరకు విద్యార్థులు ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నా సరే వీరిద్దరది జోక్యం ఉండాల్సలిందే అన్న రేంజ్‌కు వెళ్లిపోవడంతో..ఈ విషయంపై అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదురయ్యాయి.

తమ్ముళ్ల ఆగడాలను అప్పుడు చూసీ చూడనట్లుగా వదిలేయడం సునీతకు పెద్ద మైనస్ అయిందన్న వార్తలు అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ వినిపిస్తున్నాయి. మరోవైపు అప్పట్లో పరిటాల సునీత వర్గంలోనే చాలామంది ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారట. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు .. 2019లో ఆమె కుమారుడు శ్రీరామ్ కి టికెట్ ఇచ్చినా కూడా.. మేనమామలు చేసిన తప్పు వల్ల శ్రీరామ్ గెలవలేకపోయారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సునీత.. రాప్తాడు నుంచి పెనుగొండకు వెళ్లి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోగా..చంద్రరబాబు ఒప్పుకోకుండా రాప్తాడు టికెట్ ను శ్రీరామ్ కి బదులుగా సునీతకు ఇచ్చారు.

గత ఎన్నికలను దృష్టిలో పెట్టకున్న పరిటాల సునీత.. దానిని ఓ గుణపాఠంగా తీసుకుని ఇప్పుడు బరిలో దిగారు. సునీత ఇద్దరి తమ్ముళ్లను దూరం పెట్టి ఈసారి ప్రచారంలోకి దిగాలని చూస్తున్నారు. మరి ఈసారి సునీత తీసుకున్న నిర్ణయం తనకు ఏ విధంగా కలిసి వస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY