
టీడీపీ, జనసేన తాడేపల్లిగూడెం జెండా సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ అదుర్స్ అంటూ పొలిటికల్ విశ్లేషకులు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తూనే ఈ పదేళ్లలో తాను ఏం ఆశించి రాజకీయాలలో తిరుగుతున్నానంటూ గట్టిగానే ప్రశ్నించారు పవన్. నిస్వార్ధంగా ప్రజల కోసమే పని చేస్తున్న తనకు వైసీపీ నేతలు ఇస్తున్న బిరుదులేంటని ఆవేదన వ్యక్తం చేశారు. పర్వతం ఎవరికీ కూడా వంగి సలాం చేయదని వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికలకు సిద్ధం అంటున్న జగన్‌కి యుద్ధం ఇద్దామని ఏపీ వాసులకు పిలుపునిచ్చారు.
జగన్‌కు ఓటేయొద్దని గత ఎన్నికలలో తాను చెప్పినా ఎవరూ వినలేదని..కానీ ఈ ఐదేళ్లలో జగన్ పాలనలో అందరూ మోసపోయారని వపన్ విమర్శించారు. ఐదు కోట్ల మంది ప్రజలను..ఓ ఐదుగురు దగ్గర తాకట్టు పెట్టారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సొంత బాబాయిని చంపించిన వ్యక్తి..జగన్ అని చివరకు సొంత చెల్లిని గోడకేసి కొట్టిన మనిషని జగన్ గురించి ఘాటైన విమర్శలు చేశారు. ఇలాంటి వైసీపీ నేతలతా తనను విమర్శించేదీ.. తనను వ్యక్తిగతంగా ప్రశ్నించేది అంటూ గట్టిగానే ఇచ్చి పడేశారు. మాట్లాడితే నాలుగు పెళ్లిళ్లు అంటున్నారని..ఆ నాలుగో పెళ్లాం జగనా అంటూ సీరియస్ గానే చురకలు అంటించారు.
మాట్లాడితే 24 సీట్లు అని ఎద్దేవా చేస్తున్నారన్న పవన్..వామనుడు ఒక్క అడుగుతోనే బలి చక్రవర్తిని అంతం చేశాడన్న పురాణ కథలను ఉదాహరణగా తీసుకుని మరీ వైసీపీ నేతలందరికీ ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. అన్ని స్థానాలలోనూ పోటీ చేయడానికి మన దగ్గర వేలకోట్లు ఉన్నాయా..? అని పవన్ ప్రశ్నించారు. టీడీపీలా జనసేనకు బలమైన సంస్థాగత వ్యవస్థ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడిప్పుడే జనసేన ఇల్లు కడుతున్నామని.. కోట కూడా కడతామన్న పవన్.. తాడేపల్లి కోటను కూడా టీడీపీ, జనేన కూటమితో కూలగొడతాం అని హెచ్చరించారు. ప్రజలకు పాతికేళ్లు భవిష్యత్తు ఇవ్వాలన్నేది..తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుని 53 రోజులు జైల్లో పెట్టడం తనను బాధించిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భార్యని కూడా అనరాని మాటలంటే బాధ కలిగిందన్నారు. తన కూతురు స్కూలులో చనిపోయిందని సుగాలి ప్రీతి తల్లి చెప్తే.. రెండు చోట్ల ఓడి కూర్చున్న తనకు నిస్సహయతగా అనిపించిందని ఆ రోజులను తలచుకుని అసహనం వ్యక్తం చేశారు . అందరూ కష్టాలు చెబుతుంటే తాను చలించానని..ఇప్పుడు వీరందరి కోసం తాను నిలపడకపోతే.. రేపు తన కోసం, జనసైనికుల కోసం, ప్రజల కోసం ఎవరూ నిలబడరన్న పవన్… అందుకే పొత్తుకు ప్రతిపాదించానన్న విషయాన్ని సభా వేదికగా వివరించారు.
రానున్న 45 రోజులలో వైసీపీ గూండాలు, క్రిమినల్స్ ఎవరైనా సరే టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలపై దాడులకు పాల్పడితే మాత్రం మక్కెలు విరగ్గొట్టి మడత మంచంలో పడుకోబెడతామంటూ కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో కూటమి విజయానికి అంతా కృషి చేయాలని..హాయ్ ఏపీ, బైబై ఏసీపీ అంటూ పవన్ కంక్లూజన్ ఇచ్చారు. మొత్తంగా పవన్ పవర్ ఫుల్ స్పీచ్.. ఏపీ పొలిటికల్ వాతావరణంలో మరింత హీటు పుట్టించినట్లు అయింది. 24 సీట్ల గురించి జనసేన వర్గంలో పెళ్లుబుకుతున్న అసంతృప్తికి, ఇదే ఆయుధంగా వాడుకుందామనుకున్న వైసీపీ నేతలకు జనసేనలీ సీన్ ఇదీ అంటూ క్రిస్టల్ క్లియర్‌గా చెబుతూనే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తమకు తెలుసంటూ క్లారిటీ ఇచ్చేసారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE






































