వైఎస్ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సీఎం జగన్ సమీక్ష, డిసెంబర్ 21 న ప్రారంభం

CM YS Jagan Held Review on YSR Jagananna Saswatha Bhumi Hakku- Bhumi Raksha Programme,CM YS Jagan,AP CM YS Jagan,YSR Jagananna Saswatha Bhumi Hakku,YSR Jagananna Saswatha Bhumi Hakku- Bhumi Raksha Programme,CM YS Jagan Held Review,Mango News Telugu,Mango News,YSR Jagananna Saswatha Bhumi Hakku- Bhumi Raksha Launch on December 21,Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy,CM Jagan Review On YSR Jagananna Saswatha Bhumi Hakku,CM YS Jagan Review YSR Jagananna Saswatha Bhumi Hakku,YS Jagan Mohan Reddy,Land Right,Review Meeting,Amaravati

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం నాడు “వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష” కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. డిసెంబర్‌ 21 వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు సంబంధించి సర్వే ఆఫ్‌ ఇండియా శిక్షణ ఇస్తోందని, ఇప్పటికే 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని అధికారులు సీఎంకు వివరించారు. ప్రతి మండలానికి ఒక డ్రోన్‌ బృందం, డేటా ప్రాససింగ్‌ టీమ్ మరియు రీసర్వే టీమ్ ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా భూసర్వే పై అధికారులకు సీఎం వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారు.

ఒక గ్రామంలో సర్వే పూర్తి చేసి, మ్యాపులు సిద్ధం అయిన వెంటనే ఆ గ్రామా సచివాలయంలో భూముల రిజిస్ట్రేషన్‌ సేవలు అందాలని చెప్పారు. గ్రామా సచివాలయాల్లో ఇందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సర్వే నేపథ్యంలో భూ వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని పేర్కొన్నారు. అందుకు అవసరమైన వాహనాలతో పాటుగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే సర్వే శిక్షణకోసం తిరుపతిలో కొత్తగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు, ఆవాసాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేయనున్నారు. మొత్తం 17,460 గ్రామాల్లో మొదటి విడతలో 5000 గ్రామాల్లో, రెండో విడతలో 6,500 గ్రామాల్లో, మూడో విడతలో 5,500 గ్రామాల్లో నిర్వహించనున్నారు. ఇక పట్టణాలు మరియు నగరాల్లో మొత్తం 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధితో పాటుగా రాష్ట్రంలో 10 లక్షల ఓపెన్‌ ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల భూముల్లో సర్వే చేపట్టనున్నారు. 90 లక్షల మంది పట్టాదారుల భూములైన 2.26 కోట్ల ఎకరాలలో కూడా సర్వే చేపడతారు.

సర్వే అనంతరం ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డుఅందిస్తారు. ఆ కార్డులో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌, భూమి కొలతలు, మొత్తం ఏరియా, యజమాని పేరు, ఫొటో సహా క్యూ ఆర్‌ కోడ్‌ పొందుపరచనున్నారు. గ్రామాల్లో సర్వే పూర్తయ్యాక డిజిటైజ్డ్‌ కాడస్ట్రల్‌ మ్యాప్‌లు తయారీ చేస్తారు. ఈ మ్యాప్ లో గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు ఉండనున్నాయి. సర్వేలో భాగంగా భూమి కొలతలు పూర్తయ్యాక సర్వే రాళ్లను పాతుతారు. అలాగే గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్‌ ప్రాపర్టీ, టైటిల్‌,‌ వివాదాల నమోదుకూ రిజిస్టర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =