ధర్మాన ఓకే..మరి టీడీపీ నుంచి బరిలో దిగేదెవరు?

Who won, TDP , Srikakulam, YCP candidate, Dharmana Prasada Rao, TDP candidate, Gunda Lakshmidevi,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,andhra pradesh,Mango News Telugu,Mango News
Who won, TDP , Srikakulam, YCP candidate, Dharmana Prasada Rao, TDP candidate, Gunda Lakshmidevi

ఉత్తరాంధ్రలోని అత్యంత ముఖ్యమైన జిల్లా శ్రీకాకుళం గురించి చెప్పాలంటే దీనిని  ఒకరకంగా టీడీపీకి కంచుకోటగానే చెబుతారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అధికారాన్ని  దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు. టీడీపీ తరఫున పోటీ చేసిన గుండ లక్ష్మీదేవి బరిలోకి దిగి పరాజయం పాలయ్యారు.అయితే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఈ 2  కుటుంబాలే ఇక్కడ కొన్నేళ్లుగా జెండా పాతేస్తూ ఉండటంతో..రాబోయే ఎన్నికలలో  ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండబోతుందనే చర్చ మొదలయింది. ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుందన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి..

టీడీపీ ఆవిర్భావం తరువాత శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్లు ఆ పార్టీని అక్కున చేర్చుకుంటూ ఆదరిస్తూ వస్తున్నా రు. శ్రీకాకుళం నుంచి గుండ కుటుంబ సభ్యులే ఇప్పటి వరకూ ఐదుసార్లు విజయం సాధించారు. 2004, 2009లో జరిగిన ఎన్నికలతో ధర్మాన ప్రసాద రావు కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.  2019 ఎన్నికల్లో..  వైసీపీ పవనాలు ఎక్కువగా వీయడంతో.. ధర్మాన ప్రసాదరావును  విజయం వరించింది.

2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ అప్పల సూర్యనారాయణపై 7వేల227 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని నమోదు చేసుకున్నారు. 2009లో కూడా ధర్మాన ప్రసాద రావే వరుస విజయాన్ని దక్కించుకున్నారు. కానీ 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో ధర్మాన ఘోరంగా ఓడిపోయారు. కానీ  2019 ఎన్నికల్లో మాత్రం తిరిగి ధర్మాన ప్రసాదరావు మరోసారి విజయం సాధించారు.

1983లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన తంగి సత్యనారాయణ.. శ్రీకాకుళం నుంచి విజయం సాధించారు. 1985 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేసిన గుండ అప్పల సూర్యనారాయణ గెలిచి.. ఆ తర్వాత.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ వచ్చారు.  ఇటు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎలక్షన్  సరళిని ఒకసారి పరిశీలిస్తే.. ఈ నియోజకవర్గం టీడీపీ గెలుపొందే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తోంది.

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తరువాత తొమ్మిది ఎన్నికలు జరగ్గా, టీడీపీ ఏకంగా ఆరుసార్లు  విజయాన్ని సాధించింది. దీనిలో ఇంకో విశేషం ఏంటంటే..ఆ ఆరుసార్లులో కూడా  టీడీపీ నుంచి గుండ కుటుంబ సభ్యులే  ఐదుసార్లు విక్టరీని సాధించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావుకు  ఇక్కడి ఓటర్లు మూడుసార్లు విజయాన్ని అందించారు. అయితే  ఇప్పుడు 2024లో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలలో వయసు రీత్యా లక్ష్మీదేవికి సీటు ఇచ్చే విషయంలో టీడీపీ  పునారాలోచనలో పడినట్లు తెలుస్తోంది.అటు వైఎస్సార్సీపీ నుంచి మాత్రం ధర్మాన ప్రసాధరావే పోటీ చేయబోతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =