పెమ్మసాని దెబ్బకు వైసీపీ కకావికలం

Pemmasani chandrasekhar, guntur, TDP MP Candidate, Lok sabha elections,YCP,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,AP Political Updates,AP,andhra pradesh,Mango News Telugu,Mango News
Pemmasani chandrasekhar, guntur, TDP MP Candidate, Lok sabha elections

పెమ్మసాని చంద్రశేఖర్.. అమెరికా నుంచి వచ్చాడు.. సాప్ట్‌గా ఉన్నాడు.. పైగా డాక్టర్.. ఆయనతో ఏమవుతుందని అనుకుంది అధికార వైసీపీ. గుంటూరులో ఈసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసింది. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ దెబ్బకు గుంటూరులో వైసీపీ కుదేలుమంటోంది. ఆయన దూకుడు చూసి వైసీపీ పుణాదులు కదిలిపోతున్నాయి. ప్రత్యర్థులు ఆయన ముందు నిలవలేకపోతున్నారు. పెమ్మసానిని తట్టుకొని నిలబడేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఎన్ని కుట్రలు చేసినప్పటికీ వారి వల్ల కావడం లేదు. గెలుపే లక్ష్యంగా గుంటూరులో ప్రజా బలాన్ని పెంచుకుంటూ పెమ్మసాని చంద్రశేఖర్ దూసుకెళ్తుంటే.. వైసీపీ మాత్రం చల్లబడిపోతోంది.

వాస్తవానికి మూడు, నాలుగు నెలల క్రితమే పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా నుంచి వచ్చాడు. కానీ గత 20 ఏళ్లుగా పెమ్మసాని ఫ్యామిలీ గుంటూరు ప్రజలకు అండగానే ఉంటోంది. సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకుంటోంది. ఇప్పుడు గుంటూరు ప్రజల కోసం పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికా నుంచి సొంత గడ్డకు తిరిగొచ్చారు. తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దీంతో నిత్యం ప్రజలతో మమేకమవుతూ అన్ని వర్గాల వారిని కలుపుకొని పోతున్నారు.

ఇప్పటికే గుంటూరు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను పెమ్మసాని చుట్టేశారు. అన్ని వర్గాల వారితో, ప్రాంతాల వారితో పెమ్మసాని ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజాదరణ పెంచుకుంటున్నారు. వైసీపీ తప్పులను ఎత్తి చూపుతూ.. ప్రచారాలతో పెమ్మసాని హోరెత్తిస్తున్నారు. స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున గుంటూరు వాసులు తరలివచ్చి పెమ్మసానికి మద్ధతు పలుకుతున్నారు. ప్రజల నుంచి పెమ్మసానికి వస్తున్న మద్ధతు చూసి.. ప్రత్యర్ధులు నోరెళ్లబెడుతున్నారు. అతి తక్కువ సమయంలోనే పెమ్మసాని అంతలా ప్రజాబాలం పెంచుకోవడం.. ప్రజల మద్ధతు కూడబెట్టుకోవడాన్ని చూసి.. ఆయన్ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమే అవుతున్నాయి.

పెమ్మసాని దెబ్బకు వైసీపీ ఏకంగా గుంటూరులో అభ్యర్థులనే మార్చేసింది. ఇప్పటికే రెండుసార్లు క్యాండిడేట్లను ఛేంజ్ చేసింది. మొదట్లో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును వైసీపీ గుంటూరు అభ్యర్థిగా ప్రకటించింది. కానీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఆయన తట్టుకోలేరని భావించి తొలగించింది. ఉమ్మారెడ్డి స్థానంలో కిలారు రోశయ్యను బరిలోకి దించుతోంది. గుంటూరులో వైసీపీ అభ్యర్థులను మార్చినప్పటికీ ప్రయోజనం లేదని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ప్రజలంతా పెమ్మసాని వైపే ఉన్నారని.. ఇప్పుడు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పెమ్మసానిని ఢీ కొట్టడం కష్టమేననే చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఈసారి గుంటూరులో పెమ్మసాని గెలుపు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE