సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలంటే కుదరదు – టీడీపీ అధినేత చంద్రబాబు

AP Ex CM Chandrababu Naidu Attends TDP New Legal Cell Swearing in Ceremony at Mangalagiri Today, AP Ex CM Chandrababu Naidu, TDP New Legal Cell Swearing in Ceremony, TDP Mangalagiri Ceremony, Mango News, Mango News Telugu, Ex CM Chandrababu Naidu, TDP Chief Chandrababu Naidu, TDP New Legal Cell Swearing in Ceremony, Chandrababu Naidu Latest News And Updates, Chandrababu Naidu, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan Latest News And Live Updates, YSR Congress Party, Telugu Desham Party

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి మూడు రాజధానుల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ లీగల్ సెల్ కొత్త కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు, పార్టీ న్యాయవిభాగం అధ్యక్షుడు కనకమేడల రవీంద్ర కుమార్ సహా పలు జిల్లాలకు చెందిన న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మార్చాలంటే కుదరదని, దీనిని కోర్టులు కూడా అనుమతించవని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతిలో రాజధానికి ఒప్పుకున్నారని, అయితే అధికారంలోకి రాగానే మాట మార్చారని చంద్రబాబు మండిపడ్డారు.

మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉందని, ఎందరో నాయకులను అందించిందని పేర్కొన్నారు. ఇక తన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను, ఎందరో ముఖ్యమంత్రులను చూశానని, అయితే వైసీపీలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని అన్నారు. ఇప్పుడు ఏపీలో అన్ని వ్యవస్థలు పతనమవుతున్నాయని, మరో సంవత్సరం పాటు ఈ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని అన్నారు. అందరి చరిత్రలు నా దగ్గర ఉన్నాయని, తప్పుచేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేదిలేదని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + nine =