విద్య‌.. వైద్యంపై పెమ్మ‌సాని ప‌వ‌ర్‌ఫుల్ ఎజెండా

Pemmasanis Powerful Agenda On Education Medicine, Pemmasanis Powerful Agenda, Powerful Agenda On Education, Education Medicine, Pemmasani Agenda , Education , Medicine , TDP Candidate , AP State Elections , Assemble Elections, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pemmasani agenda , education , medicine , TDP candidate , AP State elections , Assemble Elections

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దివిన మెరిట్ స్టూడెంట్‌.. 1993-94 ఎంసెట్‌లో టాప్ ర్యాంక‌ర్‌. ప్ర‌భుత్వ క‌ళాశాల‌లోనే వైద్య‌విద్య‌ను అభ్య‌సించాడు. ఉన్న‌త విద్య‌కోసం అమెరికా వెళ్లాడు. అక్క‌డి వారికి ఆయ‌నే గురువుగా మారాడు. అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా, ఫిజిషియన్‌గా పేరుప్ర‌ఖ్యాత‌లు పొందిన డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.. పేద‌ల‌కు విద్య‌, వైద్యం అందుబాటులో ఉంటే చాలు.. వారి ఇబ్బందులు 90 శాతం తొల‌గిపోతాయ‌ని గుర్తించారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం కూట‌మి గుంటూరు లోక్‌స‌భ అభ్య‌ర్థిగా ప్ర‌చారంలో ఉన్న ఆయ‌న పేద‌ల‌కు విద్య‌, వైద్యం అందుబాటులోకి తేవ‌డ‌మే త‌న ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేర‌కు  ప‌వ‌ర్‌ఫుల్ ఎజెండా రూపొందించారు. అందుకోసం అవ‌స‌ర‌మైతే.. అమెరికాలోని ఎన్నారై మిత్రుల‌ను ఒక్క‌తాటిపైకి తెచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. సొంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టేందుకు ముందుకొచ్చారు.

అమెరికాలో వైద్యవృత్తిని కొనసాగిస్తున్న స‌మ‌యంలోనే.. స్వ‌స్థ‌లంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌. విద్యా రంగంలోను, వైద్య‌రంగంలోనూ త‌న‌కు  ఎదురైన ఎన్నో ఆటుపోట్ల‌ను అధిగ‌మించి.. ల‌క్ష్యాన్ని సాధించిన  పెమ్మ‌సాని.. ఆర్థికంగా స్థిర‌ప‌డ్డారు. దీంతో పేద విద్యార్థుల చ‌దువుల‌కు త‌న‌కున్న దాంట్లో కొంత ఖ‌ర్చు చేయాల‌ని సంక‌ల్పించారు. ఇప్ప‌టికే ఎంతో మందికి వ్య‌క్తిగ‌తంగా స‌హాయం అందించారు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకున్నారు. ఆదుకుంటూనే ఉన్నారు. ప్ర‌స్తుతం గుంటూరు లోక్‌స‌భ టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న పెమ్మ‌సాని.. విద్య‌, వైద్య‌రంగాల్లోని లోపాల‌ను స‌రిచేసి, పేద కుటుంబాల‌కు వాటిని చేరువ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

పిల్ల‌లకు నాణ్య‌మైన చ‌దువులకు.. వ‌య‌సుతో వ‌చ్చే రోగాల‌ చికిత్సల‌కే  పేద‌ల సంపాద‌న ఖ‌ర్చ‌యిపోతుంద‌ని భావించిన డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.. వారి ఖ‌ర్చుల భారాన్ని త‌న‌పై వేసుకునేందుకు సిద్దం అవుతున్నారు. గుంటూరు లోక్‌స‌భ ప‌రిధిలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ సొంత నిధుల‌తో పాఠ‌శాల‌లు నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ. 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయ‌లు వ‌ర‌కూ వెచ్చిస్తాన‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. పాఠ‌శాల‌లు వాటంత‌ట అవే న‌డిచే విధంగా అతి త‌క్కువ ఫీజులే పెట్టి, పేద కుటుంబాల‌కు చెందిన విద్యార్థుల‌కు సైతం కార్పొరేట్ విద్య అందిస్తాన‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే తెనాలిలో అలాంటి విద్యావ్య‌వ‌స్థ‌ను పెమ్మ‌సాని న‌డుపుతున్నారు.

స్వ‌త‌హాగా.. వైద్యుడైన డాక్ట‌ర్ పెమ్మ‌సాని.. పేద‌ల‌కు స‌త్వ‌ర వైద్య‌సేవ‌ల‌ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. నిపుణులైన వైద్య‌బృందం స్నేహితులుగా క‌లిగిన చంద్ర‌శేఖ‌ర్‌.. వారి స‌హాయంతో.. గుంటూరు పార్ల‌మెంట్ ప‌రిధిలో  ఒక‌టి, రెండు సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రులను పెట్టించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు. ఆ ఆస్ప‌త్రుల్లో అన్ని సేవ‌లూ, రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు త‌క్క‌వ ధ‌ర‌కే చేసేలా, అందుకు అవ‌స‌ర‌మైతే సొంత డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టేలా.. పెమ్మ‌సాని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అందుకే.. గుంటూరు ఎంపీ అభ్య‌ర్థిగా బ‌ల‌మైన ఎజెండాతో ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతున్న పెమ్మ‌సానికి అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. గుంటూరువాసుల‌కు విద్య‌, వైద్యం అందుబాటులోకి రావాలంటే డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ను గెలుపించుకోవాల‌నే త‌ప‌న చాలామందిలో క‌నిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE