Will The Political Scene Change In AP?, Political Scene Change In AP, AP Political Scene Change, AP Political Scene, AP State Election, Assemble Elections, CM Jaganmohan Reddy, YCP, TDP, BJP, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP State election , Assemble Elections , CM Jaganmohan Reddy , YCP , TDP , BJP

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. చేజారిపోతున్న ప‌ట్టును పెంచుకునేందుకు అధికార పార్టీ వైసీపీ బ‌స్సు యాత్ర‌కు సిద్ధం అవుతోంది. మేమంతా సిద్ధం పేరుతో మేమంతా సిద్ధం.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 26 లేదా 27వ తేదీన ఇడుపుల పాయ నుంచి ఇఛ్చాపురం వరకూ రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులు ఈ యాత్ర కొన‌సాగించేందుకు ప్లాన్ వేస్తున్నారు. రోజుకో జిల్లాలో బస్సు యాత్ర ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఉదయం ప్రజలతో ఇంట్రాక్షన్.., మ‌ధ్యాహ్నం లేదా సాయంత్రం సమయాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ప్ర‌ణాళిక‌లు ర‌చించారు.

తొలి విడతలో 21-24 రోజుల్లో బస్సు యాత్ర ముగించి ఆ తరువాత ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు, ర్యాలీల ద్వారా నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉండేలా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ప్రతి పార్లమెంట్ స్థానంలోని ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా రూట్ మ్యాప్ ఉంటుంది. ఇప్పటికే పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో బేటీ అయిన వైఎస్ జగన్ ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ పర్యటన, ఉండాలి, రూట్ మ్యాప్ ఎలా ఉంటే మంచిదనే వివరాలపై చర్చించారు. ప‌డిపోతున్న గ్రాఫ్ ను ఈ బ‌స్సు యాత్ర ద్వారా మ‌ళ్లీ పెంచుకోవాల‌ని వైసీపీ నేత‌లు అంద‌రూ సిద్ధం అయ్యారు. ఎన్నిక‌ల‌కు భారీ స‌మ‌యం ఉండ‌డంతో దాన్ని స‌ద్వినియోగం చేసుకునేలా అధికార పార్టీ స‌రికొత్త వ్యూహాల‌తో ముందుకు వెళ్తోంది.

అధికార పార్టీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో వైసీపీ అప్ర‌మ‌త్త‌మైంది. గెలుపు అవ‌కాశాల‌ను మెరుగుప‌రుచుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాల్లో మునిగితేలుతోంది. మ‌రోవైపు కూట‌మి కూడా.. రోజురోజుకూ బ‌లోపేతం అవుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించబోతోందని సర్వేలు చెబుతున్నాయి.  సీ-వోటర్‌-ఏబీపీ చానల్‌ సర్వే ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ కూటమి 20 సీట్లు గెలుచుకోనుంది. వైసీపీకి 5 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 44.7 శాతం ఓట్లు.. వైసీపీకి 41.9 శాతం ఓట్లు.. కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమికి మూడు శాతం ఓట్లు వస్తాయని విశ్లేషించింది. ఈక్ర‌మంలో పొలిటిక‌ల్ ఎప్పుడు ఎలా మారుతుందో అన్న ఉత్కంఠ ఏర్ప‌డింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =