జగన్ పాలనపై ఎందుకంత అసంతృప్తి?

Political Giants Who Left YCP, Political, Left YCP, Jagan's rule, Janga Krishnamurthy, MP Lau Srikrishna Devarayulu, Vemireddy Prabhakar Reddy, Balashauri,YCP, TDP, Chandrababu, Jagan,BJP,Pawan kalyan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Political, left YCP,Jagan's rule,Janga Krishnamurthy, MP Lau Srikrishna Devarayulu, Vemireddy Prabhakar Reddy, Balashauri,YCP, TDP, Chandrababu, Jagan,BJP,Pawan kalyan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల‌కు ముందే రాజ‌కీయ దిగ్గ‌జాలు కొంతమంది ఆపార్టీని వీడిపోవడం వైసీపీకి గట్టి దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. ఒక‌రిద్ద‌రంటే అనుకోవ‌చ్చు.. ప‌దుల సంఖ్య‌లో ప్ర‌ముఖ  ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదలి వెళ్లిపోవడం షాక్ అంటున్నారు.

అంతేకాదు  వేల సంఖ్య‌లో ద్వితీయ శ్రేణి నాయ‌కులు వైసీపీని వ‌దిలి వెళ్లిపోయారు. ఎన్నిక‌ల వేళ ద్వితీయ‌, తృతీయ శ్రేణి నాయ‌కులు స్థానిక ప‌రిస్థితుల ఆధారంగా పార్టీలు మార‌డం స‌హ‌జం. కానీ రాజ‌కీయంగా ఓ వెలుగు వెలిగి.. పార్టీ అధికారంలోకి వ‌స్తే ప‌ద‌వులు గ్యారంటీ ఉన్న  నాయ‌కులు కూడా వైసీపీని వీడటం జగన్ పాలనాలోపాలను, ఆయన  నిరంకుశత్వాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి మొద‌లుపెడితే అనంత‌పురం వ‌ర‌కు కేంద్ర‌మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడి వెళ్లిపోయారు.జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లే కాదు.. సొంత పార్టీ నాయ‌కులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారడానికి నిద‌ర్శ‌నం సీనియ‌ర్ నేత‌లు పార్టీని వ‌దిలి వెళ్ల‌డమని ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర‌మాజీ మంత్రి కిల్లి కృపారాణి , ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా పూత‌ల‌ప‌ట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌, చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఎలీజాలు వైసీపీని వీడారు. అయితే వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌డంతో పాటు.. ఆపార్టీకి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని వీళ్లంతా ముందే ఊహించి జ‌గ‌న్‌కు ముందుగానే గుడ్‌బై చెప్పేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది .

అనంత‌పురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, శింగ‌న‌మ‌ల మాజీ ఎమ్మెల్యే యామిని బాల‌, ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడి వెళ్లిపోయారు. వీళ్లంతా ఆయా జిల్లాలో ఎంతో ప్ర‌భావ‌వంత‌మైన నాయ‌కులు.

గుర‌జాల మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తి, ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు, ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాకు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరి వంటి ఎంతోమంది  కీల‌క రాజ‌కీయ నాయ‌కులు వైసీపీకి రాజీనామా చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై సొంత పార్టీ నాయ‌కులే తీవ్ర అసంతృప్తితో ఉండటంతోనే ఈ వలసలన్న వాదన ఏపీలో బలంగా వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY