దామచర్ల బ్రదర్స్ పొలిటికల్ వార్.. చివరికి టికెట్ దక్కేదెవరికి?

Damacharla, Damacharla brothers, political war, Damacharla Janardhan, Damacharla Satya, TDP, Ongole, Ongole TDP Ticket, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Damacharla brothers, political war, Damacharla Janardhan, Damacharla Satya, TDP

మొన్నటి వరకు కేశినేని బ్రదర్స్.. ఇప్పుడు దామచర్ల బ్రదర్స్.. ఏపీలో అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ కాక రేపుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నానికి తెలుగు దేశం పార్టీ హైకమాండ్ ఈసారి టికెట్ నిరాకరించింది. ఆయనకు కాకుండా నాని సోదరుడు కేశినేని చిన్ని వైపు టీడీపీ మొగ్గు చూపింది. దీంతో విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని చిన్ని అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. కొద్దిరోజులక్రితం నాని టీడీపీకి గుడ్ బై చెప్పేసి.. వైసీపీలో చేరిపోయారు. వైసీపీ అధిష్టానం నానికి విజయవాడ ఎంపీ టికెట్ కట్టబెట్టింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ తెరపైకి వచ్చింది.

ఒంగోలులో దామచర్ల బ్రదర్స్ అంటే తెలియనివారుండరు. ప్రస్తుతం దామచర్ల బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ రసవత్తరంగా కొనసాగుతోంది. టికెట్ కోసం ఇద్దరు అన్నదమ్ములు పాట్లుపడుతున్నారు. ఒంగోలు అసెంబ్లీ టికెట్ కోసం దామచర్ల బ్రదర్స్ అయిన జనార్ధన్, సత్యలు తీవ్రంగా పోటీపడుతున్నారు. 2014లో టీడీపీ తరుపున ఒంగోలు నుంచి పోటీ చేసి దామచర్ల జనార్ధన్ గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ హైకమాండ్ ఆయనకే టికెట్ ఇచ్చింది. అయితే ఈసారి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో జనార్థన్ ఓటమిపాలయ్యారు.

ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా జనార్థన్ ఒంగోలు టికెట్ ఆశిస్తున్నారు. ఈసారి ఎలాగైనా టికెట్ తనకే దక్కుతుందనే ఆశతో పాటు.. కచ్చితంగా తాను గెలిచి తీరుతానని జనార్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టారట. ప్రజలకు దగ్గరగా ఉంటూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారట. అయితే అదే టికెట్‌ను జనార్థన్ సోదరుడు అయిన సత్య కూడా ఆశిస్తున్నారు. సత్య ఎలాగైనా టికెట్ కోసం పోటీకి వస్తారని ఊహించిన జనార్థన్ కొద్దిరోజులుగా ఆయన్ను పక్కకు పెడుతూ వస్తున్నారట.

ఇప్పుడు అనుకున్నట్లుగానే సత్య కూడా టికెట్ కోసం పోటీపడుతున్నారు. అలాగే తనకు టికెట్ దక్కకపోయినా తన సోదరుడు జనార్థన్‌కు టికెట్ దక్కకుండా సత్య ప్రయత్నాలు చేస్తున్నారట. ఎట్టిపరిస్థితిలోనైనా జనార్థన్‌కు టికెట్ ఇవ్వొద్దని హైకమాండ్ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట. అంతేకాకుండా ఈసారి టీడీపీ పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నందున.. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైకమాండ్‌కు సూచిస్తున్నారట. చివరికి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =