రాజధాని చుట్టూ వైసీపీ నేతల రాజకీయాలు

TDP, YCP, CONGRESS,JANASENA, ELECTIONS, BJP , Chandrababu, Pavan Kalyan, YS Jagan , YCP leaders,Politics, YCP leaders, capital, Mango News Telugu, Mango News,Ysrcp
TDP, YCP, CONGRESS,JANASENA, ELECTIONS, BJP , Chandrababu, Pavan Kalyan, YS Jagan , YCP leaders,Politics, YCP leaders, capital

ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాజధాని చుట్టూనే  తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏపీ రాజధాని అమరావతిగా వద్దని ..మూడు రాజధానులే ముద్దని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఉండాలని సీఎం జగన్ ప్రతిపాదనలు తెచ్చినా.. దీనికి ప్రతిపక్షాలు ఏ మాత్రం ఒప్పుకోలేదు.

టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో ప్రతిపాదించిన అమరావతిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని పట్టుబట్టడంతో ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఇటీవల సుప్రీం కోర్టులో రాజధాని కేసుపై విచారణ కూడా జరిగింది. రాజధాని కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును.. రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయడంతో..ఏప్రిల్‌కు ఈ విచారణను వాయిదా వేసింది. ఈ లోగా రెండు పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇదంతా ఇలా ఉండగా..తాజాగా సార్వత్రిక ఎన్నికలు జరగబోయే ముందు ఏపీ రాజధాని ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు త్వరలోనే రానున్న ఎన్నికల కోసం అధికార వైసీపీ, టీడీపీ,  జనసేన, కాంగ్రెస్ పార్టీలు  ప్రచారాలలో స్పీడును పెంచాయి. అయితే ఈసందర్భంగా ఒక్కసారిగా రాజధాని అంశం మరోసారి  చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు వైసీపీ నేతలంతా తమ గళాన్ని సడన్‌గా మార్చడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి  గతంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే మూడు రాజధానులు అని చెప్పినప్పుడు ఏకీభవించిన వైసీపీ నేతలంతా ఇప్పుడు   మూడు రాజధానులపై తలా ఒక మాట అనడంతో అంతా షాక్ అవుతున్నారు.

కొద్ది రోజులుగా రాజధాని విషయంలో వైసీపీ నేతల మాటల్లో తేడా కన్పిస్తుందని,  ఏ ఎండకా గొడుకు పట్టే నేతలకు వీరే ఉదాహరణ అంటూ   పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అమరావతి ఏపీ  రాజధాని అని.. ఆ తర్వాతే మూడు రాజధానులని మంత్రి అంబటి రాంబాబు కొత్త రాగం అందుకోవడంతోనే ఏపీ వాసులు షాక్ అయ్యారు. ఇదిలా ఉండగా..రాజధాని ఏమైనా అన్నం పెడుతుందా..? అని బియ్యపు మధు సుధన్ రెడ్డి వెటకారంగా మాట్లాడటం ఇంకా హైలెట్ అయింది.

వీరిద్దరి కంటే రెండాకులు ఎక్కువ చదివినట్లు హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా కొనసాగాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేయడం మరింత హాట్ టాపిక్ అయింది .అంతేకాదు ఏపీకి ఉమ్మడి రాజధాని మంచిదేనని మంత్రి పెద్దిరెడ్డి రీసెంట్‌గా కామెంట్లు  చేశారు. దీంతో వైసీపీ నేతల మాటలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. సోషల్ మీడియాలోనూ  తెగ వైరల్ అవుతున్నాయి.   సార్వత్రిక ఎన్నికల వేళ వీరి కామెంట్లు  వెనుక మర్మమేమిటనే చర్చ జరుగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ