మళ్లీ తెరమీదకు వచ్చిన వైఎస్ పంచె కట్టు

AP Politics ,Punch politics in AP,YS Panche Kattu, Pavan Kalyan, YS Jagan , YCP leaders,Politics, Pancha Kattu, roja, YS Sharmila, YS Rajashekar reddy, Andhra Pradesh News Updates, AP Elections, Mango News Telugu, Mango News
AP Politics ,Punch politics in AP,YS Panche Kattu, Pavan Kalyan, YS Jagan , YCP leaders,Politics,

అచ్చమైన ఆంధ్రుల పంచెకట్టులో జాతీయస్థాయిలోనూ ఓ వెలుగు వెలిగిన నేత ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు వైఎస్సార్‌దే.  మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు చెప్పగానే..  ఆయన మార్క్ ఆఫ్ గవర్నెన్స్‌తో పాటు ఆయన పంచె కట్టు కూడా అందరికీ గుర్తుకు వస్తుంది. కానీ అదే వైఎస్ పంచె కట్టుపై ఇప్పుడు మరో కోణంలో రాజకీయంలో నయా చర్చ జరుగుతోంది. అవును.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ పంచె చుట్టూనే పొలిటికల్ పంచులు పేలుతున్నాయి.

ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు.. యువరాజ్యం అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్.. కాంగ్రెస్ లీడర్లను ఒక్కరొక్కరినీ చూపిస్తూ.. పంచెలూడదీసి కొట్టాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ డైలాగ్ రీ సౌండ్స్ చేస్తూ వినిపిస్తూనే ఉంటుంది.   ఆ పవర్‌ఫుల్ పంచె డైలాగ్‌ తర్వాతే  రియల్ పొలిటికల్ ఫైర్‌ బ్రాండ్‌ అనే పేరు పవన్‌కు వచ్చింది. పవన్ కళ్యాణ్ పంచె డైలాగ్‌కు అప్పట్లో ప్రజారాజ్యం  అధ్యక్షుడిగా ఉన్న చిరంజీవి కూడా కోరస్ ఇచ్చారు.ఆ  తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయి..చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీతో జనం కోసం పోరాడుతూనే ఉన్నారు.

ఇదంతా ఎప్పుడో జరిగిపోయినా..ఆ పదిహేనేళ్ల కిందటి పంచె డైలాగ్  ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో మరోసారి ట్రెండ్ అవుతోంది.  కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వర్సెస్ వైసీపీ  మంత్రి రోజా మధ్య ఇప్పుడు ఈ  పంచె డైలాగులు తెగ పేలుతున్నాయి. చంద్రబాబు ఇంటికెళ్లి బొకే ఇచ్చినందుకైనా షర్మిలను క్షమించొచ్చు. కానీ, వైఎస్‌ఆర్ పంచెలూడదీసి కొడతానని అన్న పవన్‌ కల్యాణ్‌ కూడా షర్మిల కొడుకు పెళ్లికి చీఫ్‌ గెస్టుగా రావాలా అంటూ రోజా అన్న డైలాగ్ తో  పొలిటికల్ సెగ రేగింది.

అసలే కౌంటర్లు ఇవ్వడంలో ముందుండే షర్మిల.. రోజాకు గట్టిగానే ఇచ్చి పడేశారు. టీడీపీలో ఉండగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మీద నువ్వేసిన పంచ్ డైలాగుల్ని అప్పుడే మరిచిపోయావా తల్లీ అంటూ రోజాకు  షర్మిల చురకలేశారు. దీంతో 15 ఏళ్ల తర్వాత  వైఎస్‌ఆర్‌ని ఇప్పుడు మరోసారి గుర్తు  చేసుకుంటున్నారు ఏపీ వాసులు. మొత్తంగా అప్పుడెప్పుడో ముగిసిపోయిన అధ్యాయాన్ని రోజా, షర్మిల ఇప్పుడు  తవ్వారంటూ కామెంట్లు చేసుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seventeen =