పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. 56వేల421 ఓట్లతో ఆర్ఆర్ఆర్ సూపర్ విక్టరీ సాధించారు. ముందుగా రఘురామ నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించినా..అనూహ్యంగా ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు.
ఎలా అయినా సరే వైసీపీ రెబల్ రఘురామకృష్ణరాజును ఓడించాలని వైఎస్సాసీపీ వేసిన ఎత్తులను ఆయన చాకచక్యంగా తిప్పికొట్టారు. నిజానికి రఘురామకృష్ణరాజు బంపర్ మెజార్టీతో విజయం సాధించడం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఉండి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా పర్యటించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన ఇచ్చిన హామీని ప్రజలు నమ్మి ఆయనకు విక్టరీని అందించారు
రాజధాని అమరావతి విషయంలో వైసీపీలో ఉన్నా కూడా మొదటి నుంచి రఘురామకృష్ణరాజు పోరాటం చేశారు. ఆయనపై దాడి జరిగినా వెనక్కి తగ్గకుండా.. ఏపీకి అమరావతినే రాజధానిగా ఉండాలని పోరాటం చేశారు. నిజానికి రఘురామ వైఎస్సార్సీపీకి దూరంగా ఉండటానికి కూడా రాజధాని అంశమే ప్రధానం కారణమన్న విషయం చాలామందికి తెలుసు.
ఆ సమయంలో అమరావతి రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, ఆ ప్రాంత వాసులకు రఘురామ అండగా నిలిచారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అంటూ రఘురామకృష్ణరాజు ఇచ్చిన హామీని నమ్మిన ఉండి ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టారు. అడుగడుగునా ఆర్ఆర్ఆర్‌ను ఓడించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించినా చివరకు విజయాన్ని సాధించారాయన.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY