చివ‌ర‌కు.. నిరాశే మిగులుతోంది..!

At the end only disappointment remains,At the end disappointment,only disappointment remains,Mango News,Mango News Telugu,chandrababu naidu, tdp, skill development scam case, ap, ap politics, cid,TDP Chief Chandrababu Naidu,chandrababu naidu Latest News,chandrababu naidu Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,skill development scam Latest News,skill development scam Latest Updates
chandrababu naidu, tdp, skill development scam case, ap, ap politics, cid

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ న్యాయ‌స్థానంలో విచారణకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. తీర్పు కోసం అంత‌టా ఉత్కంఠ‌త ఏర్ప‌డుతోంది. చంద్ర‌బాబుతో పాటు కుటుంబ స‌భ్యులు, టీడీపీ శ్రేణులే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌తిసారీ తీర్పు వాయిదా ప‌డుతూనే ఉంది. మంగ‌ళ‌వార‌ము కూడా అదే జ‌రిగింది.

స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో గత నెలలో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పోరాడుతూనే ఉన్నారు. ఆ కేసులో సాక్ష్యాధారాలు బ‌లంగా ఉన్నాయ‌ని.. జగన్ ప్రభుత్వం చెబుతుంటే.. రాజకీయంగా ఎదుర్కోలేక కేవలం కక్ష సాధింపులొ భాగంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నార‌ని చంద్రబాబు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సుమారు 35 రోజులుగా దేశంలో ప్రముఖ న్యాయవ్యాదులు చంద్రబాబు తరపున వాదిస్తూ.. బెయిల్ మీద విడిపించి కాస్త ఉపశమనం కల్పించాలని ప్ర‌య‌త్నిస్తున్నారు. బాబు త‌ర‌ఫున‌ సిద్ధార్థ్ లూథ్రా, , హరీశ్ సాల్వే వంటి ప్రముఖ న్యాయవాదులు వారి అనుభవాన్ని రంగ‌రించి.. బాబు తరపున అనేక పిటిషన్లు వేసి బెయిల్ వచ్చే మార్గాలను అన్వేషిస్తున్నారు. అంతే స్థాయిలో ప్రభుత్వం తరపున, ఏసీబీ తరపున న్యాయవాదులు బాబుకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు.

తాజాగా నిన్న కూడా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో సాగింది. తప్పనిసరిగా కోర్టు తీర్పు వస్తుందన్న భావన వ్యక్తం అయింది. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనలో ఉన్న టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు కూడా ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే.. తీర్పు మంగళవారానికి వాయిదా ప‌డింది. దీంతో ఈ నెల 17న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ పిటిషన్ పై విచారణ పలు మార్లు వాయిదా పడింది. అరెస్ట్ అయ్యి నెల రోజులు దాటినా.. చంద్రబాబుకు బెయిల్ రాకపోవడం, కోర్టుల్లో ఊరట లభించకపోవడంతో టీడీపీ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మ‌రి.. 17న జ‌రిగే విచార‌ణ‌లో ఎలాంటి తీర్పు వ‌స్తుందో.. మ‌ళ్లీ వాయిదా ప‌డుతుందో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 9 =