వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాలు.. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అటు సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం కూడా పూరించారు. ప్రస్తుతం అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితా ఊహకు కూడా అందనట్లు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొందరు సిట్టింట్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేయిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగావున్న అనిల్ కుమార్ యాదవ్‌ను నరసరావుపేట నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.
ఈక్రమంలో మరో ఎమ్మెల్యేను కూడా లోక్ సభ ఎన్నికల పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. ప్రస్తుతం కుప్పం ఎమ్మెల్యేగావున్న రోజాను లోక్ సభ ఎన్నికల బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారట. కొద్దిరోజులగా రోజాకు సంబంధించి రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. ఈసారి రోజాను సైడ్ చేస్తున్నారు.. టికెట్ ఇవ్వడం లేదని ప్రచారం జరిగింది. అప్పట్లో రోజా కూడా దీనిపై స్పందించి.. టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా వైసీసీ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు.
ఇప్పుడు ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి రోజాను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు కూడా ఒంగోలు ఎంపీ టికెట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు మాత్రం చెవిరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని పట్టుపట్టుకొని హైకమాండ్ వద్ద కూర్చున్నారట. అటు సర్వేలు కూడా చెవిరెడ్డికి వ్యతిరేకంగా వచ్చాయట. ఆయన గెలుపు అవకాశాలు తక్కవుగా ఉన్నాయని తేలిందట. ఈక్రమంలో చెవిరెడ్డిని పక్కకు పెట్టి.. రోజాను ఒంగోలు నుంచి పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. ఇప్పటికే దీనిపై వైసీపీ పెద్దలు రోజాతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ