ప్రపంచ కుబేరునిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్

Arnault ,Musk, Bernard Arnault as World Champion,The richest man,LVMH CEO Arnault
Arnault ,Musk, Bernard Arnault as World Champion,The richest man,LVMH CEO Arnault

లగ్జరీ దిగ్గజం, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా మారారు. ఎలాన్ మస్క్‌ను అధిగమించి ప్రపంచలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ నివేదికతో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్.. అయితే ఇప్పుడు ఈయన కాదు. అంతర్జాతీయ విలాస వస్తువుల కంపెనీ లూయిస్ విట్టన్ ఛైర్మన్ అండ్ సీఈఓ, వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు.

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా ఎలాన్ మస్క్‌ను అధిగమించారు. దీని ద్వారా ఆర్నాల్ట్ నెంబర్ వన్ స్థానాన్ని మరోసారి దక్కించుకున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ తాజాగా 207.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. దాంతో 23.6 బిలియన్ డాలర్ల పెరుగుదలతో మస్క్ 204.5 బిలియన్ డాలర్లను అధిగమించింది. 16 లక్షల కోట్ల సంపదతో  టెస్లా అధినేత మస్క్ రెండో స్థానంలో నిలిచారు.

బిజినెస్ వార్తలను ఫాలో అయ్యే వారికి LVMH సీఈఓగా ఆర్నాల్ట్ పెద్ద పరిచయం అవసరం లేదు. 74 ఏళ్ల ఆర్నాల్ట్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా తన విలాసవంతమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. లూయిస్ విట్టన్, ట్యాగ్ హ్యూయర్, డోమ్ పెరిగ్నాన్ వంటి దిగ్గజ బ్రాండ్‌లను కొనుగోలు చేశారు. తనతో పాటు ఐదుగురు పిల్లలను కూడా వ్యూహాత్మకంగా ఇందులోకి తీసుకొచ్చారు. ఏప్రిల్‌లో ఎల్‌వీఎంహెచ్ మార్కెట్ వాల్యుయేషన్‌లో 500 బిలియన్ డాలర్లను దాటిన మొదటి యూరోపియన్ కంపెనీగా అవతరించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కాలంలో కూడా లగ్జరీ వస్తువుల కొనుగోలు చేయడం ద్వారా రికార్డులకెక్కింది.

డిసెంబరు 2022లో కూడా ఆర్నాల్ట్ మొదటి స్థానంలో నిలిచారు. టెక్ పరిశ్రమ కష్టాలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న లగ్జరీ బ్రాండ్‌ల స్థితిస్థాపకతతో విభేదించాయి. 2021లో దాదాపు 16 బిలియన్ డాలర్లకు టిఫ్పానీ అండ్ కో, ఎల్‌వీఎంహెచ్ కొనుగోలు చేయడంతో అతిపెద్ద లగ్జరీ బ్రాండ్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే టెస్లా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ స్టాక్ 13 శాతం క్షీణించడంతో మస్క్ నికర విలువ 18 బిలియన్ డాలర్లకు తగ్గింది. అదే సమయంలో  LVMH షేర్లు 13 శాతానికి పైగా పెరగడంతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ప్లేస్ కు చేరుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − one =