కాంగ్రెస్ కండువా కప్పుకోని షర్మిల భర్త అనిల్

Sharmilas Husband Anil Who Did Not Wear the Congress Scarf, Anil Who Did Not Wear the Congress Scarf, Sharmilas Husband Anil Did Not Wear the Congress Scarf, Sharmilas Husband, YS Sharmila, Brother Anil, Congress, Mallikarjun Kharge, Latest Congress News, Latest Sharmilas Congress News, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YS Sharmila, Brother Anil, Congress, Mallikarjun Kharge

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రస్థానం ముగిసింది. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనమయింది. గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయిన వైఎస్ షర్మిల పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే షర్మిల కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా ఇంట్రెస్టింగ్ సంఘన చోటుచేసుకుంది. షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఏఐసీసీ కార్యాలయంలోని స్టేజ్‌పై గురువారం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, షర్మిల, ఆమె భర్త బ్రదర్ అని ఆశీనులయ్యారు. ఆ తర్వాత ఖర్గే.. షర్మికుల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాహుల్ గాంధీ కూడా షర్మిల మెడలో పార్టీ కండువా కప్పారు. ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే.. షర్మిల భర్త బ్రదర్ అనిల్ మెడలో కాంగ్రెస్ కండువా కప్పేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు అనిల్ నిరాకరించారు. నవ్వుతూ కండువాను తిరస్కరించారు.

అయినప్పటికీ మరోసారి మల్లికార్జున ఖర్గే కండువా కప్పుకోమని సైగ చేశారు. కానీ అయినా కూడా అనిల్ కండువా కప్పుకునేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత అనిల్‌కు రాజకీయాలంటే ఆసక్తి లేదని నవ్వుతూ షర్మిల ఖర్గేకు చెప్పారు. ఆ తర్వాత ఖర్గే తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ప్రస్తతం ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

అయితే పైకి తనకు రాజకీయాలపై ఆసక్తి  లేదని అనిల్ చెబుతున్నప్పటికీ.. ఆయన కూడా రాజకీయ మంచి పట్టు ఉంది. తెర వెనుక రాజకీయాలు నడపడంలో ఆయన దిట్ట అని అంటుంటారు. 2019లో వైసీపీ విజయం సాధించడంలో అనిల్ కీలక పాత్ర పోషించారు. క్రిస్టియన్లను వైసీపీ వైపు మళ్లించేందుకు ఎంతో కృషి చేశారు. పలు క్రిస్టియన్ సంఘాలతో కూడా బ్రదర్ అనిల్ సమావేశమై.. వారిని వైసీపీ వైపు తిప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. ఏపీ కాంగ్రెస్‌లో షర్మిలకు కీలక పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో క్రిస్టియన్ సంఘాలను అనిల్ కాంగ్రెస్ వైపు తిప్పే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY