పిలిచారా.. పిలిపించారా? రేవంత్‌.. ష‌ర్మిల‌.. ఒకే రోజు ఢిల్లీకి..

Revanth Sharmila to Delhi on the Same Day, Revanth Sharmila to Delhi, Sharmila to Delhi, Same Day Revanth Sharmila to Delhi, CM Revanth reddy, YS Sharmila, Congress Highcommand, Delhi, Latest Revanth Sharmila to Delhi News, Revanth Sharmila to Delhi News Update, Telangana Congress, TS CM Revanth Reddy, Polictical News, Elections, Mango News, Mango News Telugu
CM Revanth reddy, YS Sharmila, Congress Highcommand, Delhi

ద‌క్షిణాధి రాష్ట్రాల్లో అయినా ప‌ట్టు సాధించాల‌ని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాల‌పై పోక‌స్ పెంచింది. ఇప్ప‌టికే తెలంగాణ‌ను కైవ‌సం చేసుకుంది. కర్ణాటక, తెలంగాణలో సాధించిన విజయాల స్ఫూర్తితో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప‌దేళ్ల పాటు పూర్తిగా దూర‌మైన పార్టీ మ‌ళ్లీ పుంజుకోవాల‌ని క‌స‌ర‌త్తు చేస్తోంది. భారీ వ్యూహర‌చ‌న‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీనిలో భాగంగా వైఎస్‌. రాజ‌శేఖ‌ర రెడ్డి బిడ్డ‌, వైఎస్సార్‌టీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలకు పార్టీ ప‌గ్గాలు ఇచ్చేందుకు స‌న్న‌ద్దమైంది. దీనిపై ఈరోజు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం  ష‌ర్మిల మాట్లాడుతూ, వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తాన‌ని స్వ‌యంగా చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఆమె బుధ‌వారం ఢిల్లీకి విచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనంపై ఏఐసీసీ నాయ‌క‌త్వంతో ష‌ర్మిల చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా హాజ‌రు కానున్నారు.

ఏఐసీసీ నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం వైఎస్సార్‌టీపీ విలీనంపై అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. ఈ పరిణామాల నేప‌థ్యంలో వైఎస్సార్‌టీపీ నాయ‌కుల‌తో ష‌ర్మిల మంగ‌ళ‌వారం స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఇక జ‌న‌వ‌రి 4వ తేదీన వైఎస్ ష‌ర్మిల త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరే అవ‌కాశం ఉంది. ఆమెకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు షర్మిల భర్త అనిల్‌కుమార్‌తో ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలు చర్చించినట్టు సమాచారం. ఫైనల్‌గా షర్మిలతో కూడా ఈ విషయం మరోసారి చర్చించాక ఏఐసీసీసీ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం.

ఇందులో భాగంగానే షర్మిలకు ఏపీలో పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు అధిష్ఠానం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. లేదంటే ఆమెను క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసే అవ‌కాశాలూ లేక‌పోలేదు. ఇదిలాఉండ‌గా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చ జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలకు దిశానిర్దేశం అగ్రనేతలు చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము అమలు చేసిన గ్యారంటీల విషయం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. దీంతో పాటు పార్టీ పెద్దల నుంచి నామినేటెడ్ పోస్టులపై క్లారిటీ తీసుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే.. ష‌ర్మిల ఢిల్లీ ప‌ర్య‌ట‌న రోజే.. రేవంత్ కూడా హ‌స్తిన‌కు రావ‌డం ఆస‌క్తిగా మారింది. ష‌ర్మిల‌కు పార్టీ ప‌గ్గాలు అందించే అంశం వీరితో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వాస్త‌వానికి తెలంగాణ ఎన్నిక‌ల‌కు ముందే ష‌ర్మిల త‌న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దం అయ్యారు. అందుకు రేవంత్ సుముఖంగా లేర‌ని, అందుకే వాయిదా ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ష‌ర్మిల‌కు ఏపీ బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న ప్ర‌చారం స‌మ‌యంలోనూ  రేవంత్ ఢిల్లీకి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =