శ్రీరంగనాథరాజు వెర్సస్ పితాని సత్యనారాయణ

BC voters,Sriranganatharaju, Pitani Satyanarayana, Jana Sena-TDP 1st, Jana Sena, TDP, BJP, YCP,assembly elections,CM Jagan,AP Politics, AP Elections,AP Political News, Mango News Telugu,Mango News
BC voters,Sriranganatharaju, Pitani Satyanarayana, Jana Sena- TDP 1st, Jana Sena, TDP, BJP, YCP

పశ్చిమ గోదావరి జిల్లాలో  రాజకీయాలు రోజురోజుకు హీటెక్కిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ వరుసగా టికెట్లను ప్రకటిస్తుండటంతో.. అదే ఎత్తున అసంతృప్తుల ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి.

మరోవైపు  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  మళ్లీ అధికారంలోకి రావడానికి అధికార వైసీపీ ప్రయత్నిస్తుంటే, వైసీపీని ఎలా అయినా గద్దె  దించడానికి టీడీపీ, జనసేన కూటమి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండటంతో.. దూకుడు పెంచిన అన్ని ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో  రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నాయి. ఇదిలా ఉంటే పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట రాజకీయాలు ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.  ఆచంట నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా బీసీ  ఓటర్లదే హవా. ఆచంటలో బీసీలు ఎవరిని  ఆదరిస్తే వారే అక్కడ విజయం సాధిస్తారు.

2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో  గెలిచిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు..ఇప్పుడు వైసీపీ నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.త్వరలో జరగబోయే ఎన్నికల బరిలో కూడా ఆయనే వైస్సార్సీపీ నుంచి  పోటీ చేస్తున్నారు. అయితే   సొంత పార్టీ నుంచే ఆయనపై విపరీతమైన వ్యతిరేకత ఉందన్న వాదన వినిపిస్తోంది.

అయినా కూడా సీఎం జగన్ తమ ప్రభుత్వంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో.. శ్రీరంగనాథరాజు ఎన్నికల బరిలో దిగుతున్నారు.  మరోవైపు తాజాగా టీడీపీ, జనసేన పొత్తులలో భాగంగా ఆచంట నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా పితాని సత్యనారాయణకు చంద్రబాబు మళ్లీ అవకాశం కల్పించారు.

మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు లోకల్‌గా మంచి పేరు ఉండడంతో పాటు, సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరంగనాథ రాజుపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన.. పితానికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.

మరోవైపు గతంలో కాంగ్రెస్, టీడీపీలలో మంత్రిగా పని చేసిన అనుభవంతో పాటు బలమైన నాయకుడిగా పితాని సత్యనారాయణకు  గుర్తింపు ఉంది. ఇప్పుడు మరోసారి ఆయనకే  టికెట్ ప్రకటించడంతో పితాని దూకుడుగా  వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అయితే ఆచంట నియోజకవర్గంలో జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడిన చేగొండి సూర్యప్రకాశ్.. పితానికి సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY