సైకిలెక్కనున్న లావు శ్రీకృష్ణదేవరాయలు.. ఇదీ క్లారిటీ

TDP, AP Elections, AP Politics, Lavu srikrishna devarayalu, chandrababu naidu,YSRCP,Assembly elections,Narasaraopet,Lok Sabha constituency,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates,AP Political updates,Mango News Telugu,Mango News
TDP, AP Elections, AP Politics, Lavu srikrishna devarayalu, chandrababu naidu

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేస్తున్నాయి. గెలుపు లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటి నుంచే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దించుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏడు విడుతలుగా అభ్యర్థులను ప్రకటించారు. ఇటు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న జనసేన-టీడీపీ కూటమి కూడా సీట్ల సర్దుబాటుపై క్లారిటీ ఇచ్చేసింది. అలాగే జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. తెలుగు దేశం పార్టీ 94 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది.

అయితే ఇదే సమయంలో టికెట్ దక్కక పెద్ద ఎత్తున నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారుతున్నారు. మరో పార్టీలోకి ఫిరాయిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి జనసేన, టీడీపీల్లోకి కొందరు నేతలు జంప్ అవ్వగా.. అటు టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి వెళ్లారు. ఇక నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గురించి కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ఆయన త్వరలోనే తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకుంటారని.. ఈసారి టీడీపీ నుంచే పోటీ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

2019 ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై లక్షా యాభైవేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన నరసరావుపేట నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ వైసీపీ హైకమాండ్ ఈసారి గుంటూరు నుంచి పోటీ చేయాలని శ్రీకృష్ణదేవరయాలుకు సూచించింది. హైకమాండ్ నిర్ణయంతో ఏకీభవించని.. శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు.

ఈక్రమంలో కొద్దిరోజుల పాటు ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత తిరిగి ఆయన వైసీపీలో చేరుతారని గుసగుసలు వినిపించాయి. అయితే పార్టీ మార్పు అంటూ తన గురించి జరుగుతున్న ప్రచారంపై తాజాగా శ్రీకృష్ణ దేవరాయలు క్లారిటీ ఇచ్చారు.  తాను త్వరలోనే తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు నరసరావుపేట ప్రజలకు శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాశారు. నరసరావుపేట ప్రజలు తనపై చూపించిన ప్రేమాభిమానులు మరువలేనని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసమే తాను తిరిగి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకే త్వరలో టీడీపీలో కండువా కప్పుకోబోతున్నానని.. సైకిల్ ఎక్కి ఎంపీ అభ్యర్థిగా తమ ముందుకు రాబోతున్నానని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =