48 గంటలు సమయం ఇస్తున్నా, అసెంబ్లీని రద్దు చేయండి – చంద్రబాబు డిమాండ్

AP 3 Capitals, AP 3 Capitals Issue, Chandrababu Naidu, Chandrababu Online Press Meet, chandrababu over 3 Capitals Issue, TDP Chief Chandrababu Online Press Meet, TDP Chief Chandrababu Online Press Meet over 3 Capitals Issue

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆన్‌లైన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ఐదు కోట్ల మంది ప్రజల సమస్య, ఈ విషయాన్ని ఐదు కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. “వైస్సార్సీపీకి 48 గంటలు సమయమిస్తున్నా. మీరు చేసిన నిర్ణయం సరైన నిర్ణయమని భావిస్తే, ప్రజల ఆమోదయోగ్యముందని భావిస్తే, ఎన్నికల ముందు ఈ విషయాన్ని చెప్పలేదు కాబట్టి మొత్తం అసెంబ్లీని రద్దు చేయండి. రద్దు తర్వాత ప్రజల వద్దకు వెళదాం, మళ్ళీ వైస్సార్సీపీ ని ప్రజలు గెలిపిస్తే అమరావతి అంశం గురించి ఇక మాట్లాడమని” చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు ముందు చెప్పకుండా చేస్తే నమ్మించి మోసం చేసినట్టు అవుతుందని ఆయన అన్నారు. రెండ్రోజుల్లో తన డిమాండ్ పై స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకు వస్తానని చంద్రబాబు ప్రకటించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu