ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధ పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. కాగా ముందుగా బద్వేల్ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేరును ఖరారు చేసిన తెలుగుదేశం పార్టీ తాజాగా బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించింది.
ఈ స్థానంలో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధకు వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో, సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో బద్వేల్ ఉప ఎన్నికపై నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జనసేన పార్టీ కూడా సంప్రదాయాలకు అనుగుణంగా బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ