ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: 10 వాగ్ధానాలతో మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ

2021 AP Municipal Elections, AP Municipal Elections, AP Municipal Elections 2021, AP Municipal Elections 2021 Schedule, AP Municipal Elections 2021 Schedule Released, AP Municipal Elections Date, AP Municipal Elections News, AP Municipal Elections Notification, Mango News, Mango News Telugu, Municipal Elections In AP, TDP Manifesto For Municipal Elections, TDP Released Manifesto For Municipal Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శుక్రవారం నాడు మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‌10 వాగ్ధానాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు.

అన్నా క్యాంటీన్లతో రూ.5కే భోజనం, పాత పన్నుల మాఫీ- బకాయిలు రద్దు, ఆరు నెలలకు ఓసారి నిరుద్యోగులకు ఉద్యోగ మేళా, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.21 వేలకు పెంపు, ఆటో డ్రైవర్లకు టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, టిడ్కో గృహల నిర్మాణం, ప్రతి ఇంటికీ ఉచిత మంచి నీటి కనెక్షన్ వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ తో పాటుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ