ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మే 2న ఒకేసారి ఫలితాలు

2021 Assembly Elections, Assam, Assembly Election 2021 Full Schedule, Assembly Election 2021 Full Schedule Live, Assembly Election Schedule, Assembly Elections, Assembly Elections 2021, Assembly Elections Dates, Assembly Elections Dates in Four States and 1 UT, Assembly Elections Schedule, ECI Announces Assembly Election Schedule for West Bengal, ECI Likely to Announce Assembly Elections Dates, ECI To Announce Assembly Elections, ECI To Announce Assembly Elections Schedule Of Five States, Kerala, Mango News, Puducherry, TN

దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. తమిళనాడులో 234, పశ్చిమబెంగాల్ ‌లో 294, కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.7 లక్షల పోలింగ్ కేంద్రాలలో 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని 80 ఏళ్లు పైబడినవారికీ, వికలాంగులకు మరియు అవసరమైన సేవల్లో పాల్గొన్న వారికి కల్పించినట్టు తెలిపారు. అలాగే పోలింగ్ సమయం ఒక గంట పెంచుతున్నట్టు ప్రకటించారు. వీటితో పాటుగా ఇతర 16 రాష్ట్రాల్లోని 36 స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరగనున్నాయని, వీటికి ప్రత్యేకంగా షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో ఈ రోజు నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఎస్ఈసీ సునీల్ అరోరా స్పష్టం చేశారు.

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు:

  • ఫేజ్-1 పోలింగ్ : మార్చి 27
  • ఫేజ్-2 పోలింగ్ : ఏప్రిల్ 1
  • ఫేజ్-3 పోలింగ్ : ఏప్రిల్ 6
  • ఓట్ల లెక్కింపు తేదీ : మే 2

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు:

  • ఫేజ్-1 పోలింగ్ : మార్చి 27
  • ఫేజ్-2 : ఏప్రిల్ 1
  • ఫేజ్-3 : ఏప్రిల్ 6
  • ఫేజ్-4 : ఏప్రిల్ 10
  • ఫేజ్-5 : ఏప్రిల్ 17
  • ఫేజ్-6 : ఏప్రిల్ 22
  • ఫేజ్-7 : ఏప్రిల్ 27
  • ఫేజ్-8 : ఏప్రిల్ 29
  • ఓట్ల లెక్కింపు తేదీ : మే 2

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు:

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: మార్చి 12
  • నామినేషన్ చివరి రోజు: మార్చి 19
  • నామినేషన్ల పరిశీలన: మార్చి 20
  • ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 22
  • పోలింగ్ తేదీ: ఏప్రిల్ 6
  • ఓట్ల లెక్కింపు తేదీ: మే 2

కేరళ అసెంబ్లీ ఎన్నికలు:

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: మార్చి 12
  • నామినేషన్ చివరి రోజు: మార్చి 19
  • నామినేషన్ల పరిశీలన: మార్చి 20
  • ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 22
  • పోలింగ్ తేదీ: ఏప్రిల్ 6
  • ఓట్ల లెక్కింపు తేదీ: మే 2

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు:

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ: మార్చి 12
  • నామినేషన్ చివరి రోజు: మార్చి 19
  • నామినేషన్ల పరిశీలన: మార్చి 20
  • ఉపసంహరణ చివరి తేదీ: మార్చి 22
  • పోలింగ్ తేదీ: ఏప్రిల్ 6
  • ఓట్ల లెక్కింపు తేదీ: మే 2
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 10 =