కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలాసీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు వరాలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న నిర్మల.. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఈ బడ్జెట్‌లో కేంద్రం ఏపీపై వరాల జల్లు కురిపించింది.. విభజన చట్టానికి అనుగుణంగా నిధుల్ని ప్రకటించారు. ఏపీ రాజధాని అవసరాలను గుర్తించి.. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు సాయం సర్దుబాటు చేస్తామన్నారు. వచ్చే సంవత్సరాల్లో అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని అదనపు నిధులు అందిస్తామని చెప్పారు.
రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల ఆర్థిక సాయంతో పాటు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంపూర్ణ సాయం, పరిశ్రమల ఏర్పాట్లుకు ప్రత్యేక రాయితీలు, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు, విభజన చట్టంలో పొందుపర్చినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు, ఏపీలో పూర్వోదయ పథకం అమలు, నీరు, విద్యుత్, రైల్వే, రోడ్ల ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు అందచేస్తామని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద స్పెషల్ గా నిధులు అందజేస్తామని కూడా చెప్పారు. విశాఖ- చెన్నై కారిడార్ లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్ లో ఓర్వకల్లు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు ఢిల్లీకి వెళ్లారు. ఆ రెండుసార్లు కేంద్రమంత్రుల్ని కలిశారు.. ఏపీకి సాయం చేయాలని కోరారు. అలాగే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని.. అమరావతి, పోలవరంకు నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. కేంద్రం కూడా బడ్జెట్‌లో రాజధాని అమరావతికి ప్రాధాన్యం ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF