ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 నెలల్లోనే 2.90 లక్షల బియ్యం కార్డులు మంజూరు

AP Govt, AP Govt Grants More than 2.9 Lakhs New Rice Cards, AP New Ration Cards, AP New Ration Cards Distribution, ap new rice card distribution, ap new rice card status 2020, AP New Rice Cards, AP New Rice Cards status, AP News, Ap Political News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హత కలిగిన ప్రతిఒక్కరికి అందజేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పథకాలకు అనుగుణంగా మధ్యలో దళారుల ప్రమేయం లేకుండా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే, అర్హత ఆధారంగా సంక్షేమ పథకాలను మంజూరు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 2.90 లక్షలకు పైగా కుటుంబాలకు బియ్యం కార్డులను మంజూరు చేశారు. కేవలం గడిచిన రెండు నెలల్లోనే ఈ స్థాయిలో బియ్యం కార్డులు జారీ చేశారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హత కలిగిన కుటుంబాల ఇంటికి స్వయంగా వాలంటీర్లే వెళ్లి బియ్యం కార్డులు అందజేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బియ్యం కార్డుల సంఖ్య 1,50,15,765 కి చేరింది. కాగా ఏపీలో ప్రస్తుతం తొమ్మిదవ విడత ఉచిత సరుకుల పంపిణీ కొనసాగుతుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + eleven =