ఇప్పుడు జగన్‌ అనే నేను

Jagan Ane Nenu Countdown ,Congress,TDP, YCP,Chandra Babu,YS Jagan,assembly elections,Prashant Kishor,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Jagan Ane Nenu Countdown ,Congress,TDP, YCP,Chandra Babu,YS Jagan

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ముందే..ఏపీ రాజకీయాలు హీట్‌ పెంచుతున్నాయి..ఓవైపు సిద్ధం పేరుతో అధికార వైసీపీ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో దూకుడు చూపిస్తుండగా..మరోవైపు టీడీపీ,జనసేన పార్టీలు ఉమ్మడిగా సభలు నిర్వహిస్తూ.. వైసీపీపై కౌంటర్‌ అటాక్‌కు దిగుతున్నాయి. టీడీపీ,జనసేన,బీజేపీ పొత్తులో సీట్లపై కూడా క్లారిటీ రావడంతో.. ఆ మూడు పార్టీలు ఉమ్మడిగా భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేస్తున్నాయి.

 

+అయితే, గత ఎన్నికల సమయంలో.. ప్రచారంలో తన మార్క్‌ చూపించింది వైసీపీ. ప్రశాంత్‌ కిషోర్‌ నేతృత్వంలోని ఐ ప్యాక్‌ టీమ్‌.. విస్తృతంగా ప్రచారం చేస్తూ టీడీపీకి వ్యతిరేకంగా పని చేయడం వైసీపీకి కలిసి వచ్చింది. అప్పట్లో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైసీపీ ఆఫీసు ముందు , రాష్ట్రంలోని ఇతర వైసీపీ ఆఫీసుల వద్ద ‘బైబై బాబు..’ అంటూ కౌంట్‌డౌన్‌ క్లాక్‌ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అయింది.

ఈ సారి ప్రచారంలో తన పందాను మార్చిన వైసీపీ.. వైనాట్‌ 175 పేరుతో ప్రచారం చేస్తూనే వైనాట్‌ కుప్పం అంటూ చంద్రబాబుపై కూడా ఫోకస్ పెంచారు. పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచే ప్రయత్నాలు చేస్తున్న జగన్..ఇప్పుడు ”జగన్‌ అనే నేను” పేరుతో కౌంట్‌డౌన్‌ క్లాక్‌లు ఏర్పాటు చేస్తూ సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు.

ఈ కొత్త కౌంట్‌డౌన్‌ క్లాక్‌ను వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా.. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో మంత్రి జోగి రమేష్‌తోపాటు వైసీపీ నేతలు “జగన్‌ అనే నేను” పేరుతో ఏర్పాటు చేసిన కౌంట్‌డౌన్‌ క్లాక్ బోర్డును ఆవిష్కరించారు. ఆ కౌంట్‌డౌన్‌ క్లాక్‌ ప్రకారం.. మరో 72 రోజుల్లో వైసీపీ తిరిగి అధికారం చేపడుతుందనే విధంగా క్లాక్‌ కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది.దీంతో అన్ని సార్లు సేమ్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? ఫాలో అవ్వాల్సింది అవి కాదు అభివృద్ధిని వదిలేసి క్లాక్‌లు పెడితే సరిపోదని ఏపీ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE