ఏపీలో వెలుగుచూసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ దేశ చరిత్రలోనే అతి పెద్దది – అసెంబ్లీలో సీఎం జగన్

CM YS Jagan Participates Debate Regarding The Skill Development Scam in AP Assembly,CM YS Jagan Participates Debate,YS Jagan Debate Regarding The Skill Development Scam,The Skill Development Scam in AP Assembly,Mango News,Mango News Telugu,TDP Skill Development Scam Issue in Assembly,AP Assembly 2023,AP Assembly,AP Assembly Live Updates,AP Assembly Live News,AP Assembly Latest Updates,AP Assembly 2023 Live Updates,AP CM YS Jagan Mohan Reddy,AP Assembly Budget Session,AP Assembly 2023 State Budget

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ రాష్ట్రంలోనే కాదని, దేశ చరిత్రలోనే అతి పెద్దదని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దీనిపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు నష్టం జరిగిందని, సీమెన్స్‌ కంపెనీ పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఈ అతి పెద్ద కుంభకోణం వెనుక నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఈ కుంభకోణం ద్వారా రూ. 371 కోట్లు మాయం చేశారని అన్నారు. షెల్‌ కంపెనీల ద్వారా రకరకాల మార్గాల్లో రూటింగ్‌ చేసి, చివరకు ఆ డబ్బును మళ్లీ చంద్రబాబు దగ్గరకు చేర్చారని ముఖ్యమంత్రి వివరించారు.

కేబినెట్‌లో చర్చించి జారీ చేసిన జీవోకు విరుద్ధంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ సాగిందని, దీనిపై అన్ని దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. ఇక చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈ స్కామ్‌ ఊపిరిపోసుకుందని, అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో విచారణ అంటూ జరిగితే ఎలా తప్పించుకోవాలో కూడా ముందుగానే చంద్రబాబు ఊహించి, దాని ప్రకారం ప్రణాళిక రచించారని సీఎం జగన్‌ విమర్శించారు. 90శాతం సీమెన్స్‌ భరించేలా, 10శాతం మేర ప్రభుత్వం భరించేలా ఒప్పందం చేసుకున్నారని, దీనికి తగ్గట్లే 10శాతం వ్యయంలో భాగంగా ముందుగానే రూ. 371 కోట్లు విడుదల చేశారని వివరించారు. అయితే దర్యాప్తులో భాగంగా సీమెన్స్‌ కంపెనీని విచారిస్తే, ఈ వ్యవహారంతో తమకెలాంటి సంబంధం లేదని, ఇలాంటి స్కీమ్స్ తమ సంస్థలో లేవని స్పష్టం చేసిందని సీఎం జగన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =