ఏపీలో కేశినేని ఫ్యామిలీ వ్యవహారం కాక రేపుతోంది. అన్నదమ్ములు కేశినేని నాని, చిన్నిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలుగు దేశం పార్టీ ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని నానికి ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈసారి నానికి కాకుండా ఆయన సోదరుడు కేశినేని చిన్నికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నానిని టీడీపీ హైకమాండ్ ఆదేశించి. దీంతో కేశినేని నాని తెలుగు దేశం పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసేశారు.
ఈక్రమంలో బుధవారం కేశినేని నాని వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. త్వరలో నాని వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని నానికి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో జగన్‌ను కలిసిన అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ.. టీడీపీపై, చంద్రాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు తమ కుటుంబంలో చిచ్చు పెట్టారని.. ఆయన పచ్చి మోసగాడని ఆరోపించారు.
అయితే కేశినేని చేసిన వ్యాఖ్యలపై తాజాగా.. ఆయన సోదరుడు కేశినేని చిన్ని స్పందించారు. తమ కుటుంబంలో 1999 నుంచి సమస్యలు ఉన్నాయని చెప్పారు. అప్పటి నుంచి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ తాను సర్దుకొని పోతున్నానని తెలిపారు. వాటికి చంద్రబాబు నాయుడికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తమ కుటుంబంలోని సమస్యలకు చంద్రబాబు కారణమంటూ నాని చేసిన వ్యాఖ్యలకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు చిన్ని వివరించారు. అసలు నందమూరి, నారా కుటుంబాన్ని విమర్శించే అర్హత నానికి లేదని వెల్లడించారు.
టీడీపీని, చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే.. వారు తప్పకుండా తగిన శాస్తి అనుభవిస్తారని చిన్ని చెప్పుకొచ్చారు. కేశినేని నానికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడేనని.. ఆ విషయాన్ని మర్చిపోయి నాని విమర్శలు చేయడం తగదన్నారు. అలాగే కేశినేని వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో.. ఎంతో మంది మహామహలు టీడీపీని వీడినప్పటికీ పార్టీకి ఎటువంటి నష్టం జరగలేదని చిన్ని చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE