ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్

Jagan is Changing All the MPs, Jagan Changing All the MPs, Jagan Changing MPs, MPs Changing, AP, YCP, CM Jagan, YCP MPs, Lok Sabha Elections, Latest YCP MPs Changing News, YCP MPs Changing News, YCP MPs News, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
AP, YCP, CM Jagan, YCP MPs, Lok sabha elections

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తున్న జగన్.. ఒక్కరు మినహాయించి మిగిలిన సిట్టింగ్ ఎంపీలను కూడా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మూడు పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జ్‌లను జగన్ మార్చేశారు. అయితే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని మినహాయించి మిగిలిన ఎంపీలను అందరినీ మార్చేయాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కడప ఎంపీగావున్న అవినాశ్ రెడ్డిని పక్కకు పెట్టి.. ఆ టికెట్ మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని జగన్ నిర్ణయించారట. అలాగే అవినాశ్ రెడ్డిని జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించనున్నారట. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యకు ఈసారి ఎంపీ టికెట్ కాకుండా.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారట. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కూడా జగన్ పక్కకు పెట్టేస్తున్నారట. ఆ స్థానంలో కర్నాటక బీజేపీ మాజీ ఎంపీ జె శాంతమ్మను బరిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కర్నూల్ ఎంపీగావున్న డాక్టర్ సంజీవ్ కుమార్‌ను పక్కకు పెట్టేసి.. ఆ టికెట్ మంత్రి గుమ్మలూరి జయరాంకు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారట. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులుకు కూడా ఈసారి జగన్ షాక్ ఇస్తున్నారట. ఆయన స్థానంలో వైవీ సుబ్బారెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తున్నారట. అలాగే నెల్లూరు ఎంపీ టికెట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇస్తున్నారట. ప్రస్తుతం నెల్లూరు ఎంపీగావున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారట. ప్రస్తుతం నరసారావు పేట ఎంపీగావున్న లావు శ్రీకృష్ణ దేవరాయులను గుంటూరుకు పంపిస్తున్నారట. నరసారావు టికెట్‌ను గోకరాజు గంగరాజు కుటుంబానికి ఇస్తున్నారట.

ఇక కేశినేని నాని ఇటీవలే తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి బయటకొచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఆయన వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని నానికి ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట. అలాగే మచిలీపట్నంలో కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి.. ప్రస్తుతం ఆ స్థానం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరీని ఏలూరు నుంచి పోటీ చేయించనున్నారట. అలాగే నంద్యాల, తిరుపతి, చిత్తూరు, బాట్ల ఎంపీలను కూడా మార్చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారట.

త్వరలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో కాకినాడ ఎంపీ టికెట్ ముద్రగడ ఫ్యామిలీకి ఇవ్వనున్నారట. ప్రస్తుతం కాకినాడ ఎంపీగావున్న వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపనున్నారట. అలాగే అమలాపురంలో కూడా కొత్తవారికి అవకాశం ఇస్తున్నారట. ప్రస్తుతం అమలాపురం ఎంపీగావున్న చింతా అనురాధను పి.గన్నవరం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించనున్నారట. ఇక రాజమండ్రి ఎంపీ టికెట్ బీసీలకు ఇచ్చి.. ఎంపీ మార్గాని భరత్‌ని రాజమండ్రి అర్బన్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపనున్నారట. అలాగే విశాఖ ఎంపీ టికెట్‌ను బొత్స ఝాన్సీకి.. అనకాపల్లి టికెట్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక అరకు ఎంపీ టికెట్ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి.. విజయనగరం ఎంపీ టికెట్ ని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 10 =