తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2470 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 36.67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 1 గంట వరకు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 38.10 శాతం, సూళ్లూరుపేటలో 40.76, వెంకటగిరిలో 37.63, గూడూరులో 36.84, సత్యవేడులో 36, తిరుపతిలో 32.13, శ్రీకాళహస్తిలో 35.98 శాతం పోలింగ్ నమోదైంది.
మరోవైపు తిరుపతి పట్టణంలోని పోలింగ్ బూత్ లలో నకిలీ ఓటర్ల కలకలం రేగింది. వేరే ప్రాంతాలనుంచి వచ్చిన ఓటర్లు దొంగఓట్లు వేస్తున్నారంటూ టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో పలు పోలింగ్ బూత్ ల వద్ద ఆ పార్టీల నాయకులు ఆందోళన చేశారు. కాగా ఈ ఆరోపణలపై ఏపీ సీఈఓ విజయానంద్ చిత్తూరు, నెల్లూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా చూడాలని సూచించారు. దొంగ ఓట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ