తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సినీ నిర్మాతల మధ్య ఇటీవల ఓసారి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం కూడా పలువురు సినీ నిర్మాతలు కృష్ణాజిల్లా లోని మచిలీపట్నంలో ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ముఖ్యంగా సినిమా టికెట్ల విక్రయాల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్ అంశం, ఇతర సినీ పరిశ్రమ సంబంధిత సమస్యలపై మంత్రి తో నిర్మాతలు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, వంశీరెడ్డి, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ సమస్యలపై ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అనంతరం మంత్రి పేర్ని నానితో మరోసారి సినిమా నిర్మాతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ