వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారడం ఖాయం, పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం

JanaSena Chief Sri Pawan Kalyan, Janasena Party Extensive Meeting, Janasena Party Extensive Meeting at Mangalagiri, JanaSena Party PAC Member, Mangalagiri, Mango News, Pawan Kalyan Speech at Janasena Party, Pawan Kalyan Speech at Janasena Party Extensive Meeting, Pawan Kalyan Speech at Janasena Party Extensive Meeting at Mangalagiri, Pawan Kalyan Speech at Mangalagiri Party Office, Powerstar Pawan Kalyan

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ముందుగా ఇటీవల జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచిన జనసేన నాయకులు, వీరామహిళలకు అభినందనలు తెలిపారు. వైసీపీ నాయకులకు సవాల్ విసురుతున్నానని, వైసీపీ నాయకులు ఏ రకమైన యుద్ధం కావాలో చెప్పాలన్నారు. జనసేన పార్టీ ఆ యుద్ధానికి సిద్ధంగా ఉందని చెప్పారు. తాను ఎప్పుడు యుద్ధం మొదలు పెట్టనని, కానీ అవతలివైపు మొదలు పెట్టాలని చూస్తే వెనుకడుగు మాత్రం వేయనని చెప్పారు. వైసీపీ నాయకులకు ఒక్క భయం తప్ప డబ్బు, అధికారం, అహంకారం అన్ని ఉన్నాయని, ఖచ్చితంగా భయం అంటే ఏంటో కూడా చూపిస్తానని అన్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి మాట్లాడడం చేతకాక కాదని, మహిళల పట్ల గౌరవం ఉండబట్టే అలా మాట్లాడనని అన్నారు. ఎప్పుడు కూడా తాను రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే మాట్లాడతాననన్నారు. గతంలో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చింది కూడా రాష్ట్రానికి మేలు జరుగుతుందేమో అనే ఆలోచనతో మాత్రమేనని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారడం ఖాయం:

తాను మాట మీద నిలబడే వ్యక్తినని, నమ్మకం ఉంటే ప్రజలు గెలిపించి చూపించాలన్నారు. అభివృద్ధి అంటే ఏంటో, శాంతిభద్రతలు అంటే ఏంటో చూపిస్తానని, మహిళలపై దాడులు చేయాలంటే బయపడేలా చేస్తానన్నారు. అమరావతిని కాపాడతామని బీజేపీ హామీ ఇచ్చిన తరువాతే వారితో కలిసి పనిచేస్తున్నామన్నారు. అలాగే తాను రెండు చోట్ల ఓడిపోతానని కల కనలేదని, కానీ ఓడిపోయాను, అదే జీవితమని చెప్పారు. ప్రస్తుతం 151 మంది ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో 15కి పడిపోవచ్చని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారడం ఖాయమన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి రాబోతోంది, అప్పుడు పాండవసభ ఎలా ఉంటుందో చూపిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + eight =