మచిలిపట్నం ఎంపీకి టఫ్‌ ఫైట్‌!

TDP, TDP,YCP,BJP, Janasena, Congress,Pawan Kalyan, Nagababu, Arani Srinivasulu, Tirupathi, chittoor
TDP, TDP,YCP,BJP, Janasena, Congress,Pawan Kalyan, Nagababu, Arani Srinivasulu, Tirupathi, chittoor

మచిలీపట్నం(బందరు) రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ రెండు స్థానాల్లోనూ హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సాగర పట్టణంలో ఎంపీ ఫైట్‌లో గెలిచేదెవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అనుభవాన్ని, పనినే నమ్ముకున్న బాలశౌరి ఒకవైపు.. డాక్టర్‌గా పేరు ప్రఖ్యాతాలు గడించిన డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్ మరోవైపు. గత(2019) ఎన్నికల్లో వైసీపీ నుంచి బాలశౌరి విజయఢంకా మోగించారు. జగన్‌ వేవ్‌లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన కొనకళ్ల నారయణ భారీ ఓటమి మూటగట్టుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. బాలశౌరి అసలు వైసీపీలోనే లేరు. జనసేనలో ఉన్నారు. నిజానికి బాలశౌరికి జగన్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా ఆయన జనసేన వైపే మొగ్గుచూపారు. ఇటు బందరులోన బాలశౌరికి ఎమ్మెల్యే పేర్నినానికి మధ్య చాలా కాలంపాటు కోల్డ్‌ వార్‌ సాగింది. ఇదే సమయంలో అటు పవన్‌ సైతం బాలశౌరితో నిత్యం టచ్‌లో ఉంటూ వచ్చారు. చివరకు తమ పార్టీలోకి ఆహ్వానించారు. తాజాగా జనసేన తాను పోటి చేయనున్న రెండు ఎంపీ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అందులో మచిలీపట్నం నుంచి బాలశౌరి పేరు ఫిక్స్‌ అయ్యింది.

బీసీల ఓట్లు కూడా కీలకమే:

బందరు అసెంబ్లీ ఫైట్‌కు పార్లమెంట్‌ ఫైట్‌కు చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఫైట్‌లో కాపుల ఓట్లు కీలకం. అటు పార్లమెంట్ ఫైట్‌లో కేవలం కాపుల ఓట్లే కాకుండా ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా కీలకమే. ముఖ్యంగా బీసీల ఓట్ల ముఖ్యం. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను బందరు పార్లమెంట్‌ కవర్‌ చేస్తుంది. ఇందులో గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 13లక్షల పైమాటే. ఇందులో మచిలీపట్నం, అవనిగడ్డ మినాహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో కాపుల ఓట్ల కంటే ఇతర కులాల ఓట్లే కీలకం. ఇటు బాలశౌరి బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టబోతున్నారు. నిజానికి సింహాద్రి చంద్రశేఖర్‌ పోటి చేయడం ఇదే తొలిసారి. అయినా ఆయన్ను తక్కువ అంచనా వేస్తే బాలశౌరి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..

తండ్రి ఎమ్మెల్యే.. కొడుకు డాక్టర్:

ఎందుకంటే సింహాద్రి చంద్రశేఖర్‌కి క్యాన్సర్‌ డాక్టర్‌గా మంచి పేరు ఉంది. ఇప్పటివరుకు రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోవడంతో ఆయనపై ఎలాంటి అవినీతి మరకలు లేవు. ఆయన కుటంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. సింహాద్రి చంద్రశేఖర్‌ తండ్రి సత్యనారాయణ సత్యనారాయణరావు గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి మచిలీపట్నానికి చాలా దగ్గరవాడు. 1985 నుంచి 1999 మధ్య వరుసగా మూడు సార్లు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి గెలిచారు సత్యనారయాన. అటు దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రశేఖర్‌ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే వైసీపీ మాత్రం ఆయన్ను ఒప్పింటి టికెట్ ఇప్పించింది. బాగా చదువుకున్న నేపథ్యం ఉండడంతో పాటు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌ కూడా ఉండడంతో బాలశౌరి గెలుపు అంత ఈజీ కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రత్యర్థిపై విమర్శించేందుకు ఎలాంటి కారణం దొరకకపోవడం ఇక్కడ బాలశౌరికి మైనస్‌గా మారింది. మరి చూడాలి ఈ సారి బందరు ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడుతారో

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY