విజయవాడ వెస్ట్ టికెట్‌పై కూటమిలో రచ్చ!

Racha In Alliance On Vijayawada West Ticket,Vijayawada West Ticket In Suspense As Fight Over Janasena,Pothina Mahesh And Sujana Chowdary,Telugu News,Mango News Telugu,Pawan Kalyan,Jana Sena,TDP,Alliance,Mango News,Vijayawada,Jana Sena Party,Jana Sena Party News,Jana Sena Party Latest News,Jana Sena,Pawan Kalyan News,Pawan Kalyan Latest News,Venkata Mahesh Live,Venkata Mahesh Press Meet,Vijayawada West Assembly Seat,Jana Sena Vijayawada West Assembly Seat,Jana Sena Vijayawada,Pothina Mahesh,Pothina Venkata Mahesh,Venkata Mahesh News,Jana Sena Venkata Mahesh,TDP,BJP,MLA Vellampalli Srinivas,AP Politics,AP News,AP Latest News,AP Elections News,Elections 2024,AP Elections 2024

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఏ ముహూర్తనా కుదిరిందో కానీ దాదాపు ప్రతీ జిల్లాల్లోనూ  పార్టీల నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. సీటు ఆశించి భంగపడ్డ నేతలు ఒకవైపు సీటు.. అసలు సీటు వస్తుందో రాదో తెలియని అయోమయం మరోవైపు. ముఖ్యంగా ఈ రచ్చ జనసేన వర్సెస్ టీడీపీగా సాగుతోంది. గోదావరి జిల్లాల్లో జనసేన నేతలు చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ చేశారు. అయితే ఆఖరి నిమిషంలో టీడీపీకి టికెట్లు ఇవ్వడం వీరిలో అసంతృప్తికి కారణమైంది. ఇక ఇప్పటికే జనసేన 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకో మూడు ప్రకటించాల్సి ఉంది. ఈ మూడు సీట్లు ఏ నియోజకవర్గానికి చెందినవో ఇప్పటివరకు క్లారిటీ లేదు కానీ.. అందులో విజయవాడ వెస్ట్‌ ఉండాలన్నది పోతిన మహేశ్‌ ఆవేదన.

పోతిన మహేశ్‌కు జనసేనలో మంచి పేరుంది. ఆయన జనసేన క్యాడర్‌ను బిల్డ్‌ చేయడంలో ఎంతో కష్టపడ్డారు. అందుకే విజయవాడ వెస్ట్‌ సీటు ఆశిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ టికెట్ సుజన చౌదరికి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. సుజన చౌదరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. గతంలో టీడీపీలో ఉన్నారు. చంద్రబాబుకు సుజనా చాలా క్లోజ్. అందుకే ఈ టికెట్‌ సుచనాకే ఇస్తారని అంతా అనుకుంటున్నారు. నిజానికి విజయవాడ వెస్ట్‌లో పోటికి ఎప్పుడూ కూడా సుజనా పేరు వినిపించలేదు. సడన్‌గా ఆయన పేరు తెరపైకి రావడంతో పోతిన మహేశ్‌ షాక్ అయ్యారు. టికెట్ తనకే దక్కాలని ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. జనసేనకే విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వాలని మహేశ్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు తనను తాను విజయవాడ వెస్ట్ లోకల్‌గా ప్రచారం చేసుకుంటున్న పోతిన మహేశ్‌ ఒకవేళ టికెట్ రాకపోతే రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని సమాచారం. నిజానికి మొదట పోతిన వెంకట మహేశ్‌కి విజయవాడ వెస్ట్ టికెట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినా సీట్ల పంపకంలో భాగంగా ఈ సీటును వదులుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు తమ నాయకుడికి టికెట్ కేటాయించాలంటూ మహేశ్‌ అనుచరులు నిరసనలకు దిగుతున్నారు. పవన్ ఆలోచనలను మార్చడానికి, ఆయన అతని నిర్ణయాన్ని సమీక్షించడానికి దేవుడు జోక్యాన్ని కోరుతూ వారు దేవుళ్లను కూడా పూజించారు. పార్టీ అధినేత సానుకూలంగా స్పందించాలని కోరుతూ ఓ ఆలయంలో 108 కొబ్బరికాయలు పగలగొట్టారు. మరోవైపు తెలుగుదేశం సీనియర్ నేత జలీల్ ఖాన్ కూడా ఆశావహుల లిస్ట్‌లో ఉన్నారు. తనకు సీటు కేటాయించకుంటే ఉరివేసుకుంటానని గతంలో ఆయన బెదిరించారు కూడా. జలీల్ మద్దతుదారులు ఇటివల చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌ను ఆపడానికి ప్రయత్నించారు. బీజేపీకి చెందిన శివస్వామి కూడా తనకు కేటాయించిన సీటును ఆశిస్తున్నారు. బీజేపీ సీనియర్‌ నేతలతో ఎప్పటికప్పుడు ఈ విషయంపై ఫాలోఅప్‌ చేస్తున్నారు. మరి చూడాలి విజయవాడ వెస్ట్‌ టికెట్ ఎవరికి వరిస్తుందో!

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − twenty =