సెప్టెంబర్ 22 నటుడిగా నేను పుట్టినరోజు, కళామతల్లి అక్కున చేర్చుకున్న రోజు : మెగాస్టార్ చిరంజీవి

43 Years Ago Chiranjeevi Shot His First Scene On this Day, Chiranjeevi completes 42 years in the industry, Chiranjeevi Tweet, Chiranjeevi Tweet over Completion of 43 Years in Film Industry, Mango News, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi completes 42 years in the industry, Megastar Chiranjeevi Completion of 43 Years in Film Industry, Megastar Chiranjeevi Movies, Megastar Chiranjeevi Tweet over Completion of 43 Years in Film Industry

అగ్రనాయకుడు, మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానం ప్రారంభించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తను వెండితెరకు పరిచయమైన సెప్టెంబర్ 22 తేదీని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. “ఆగష్టు 22 నేను పుట్టినరోజైతే సెప్టెంబర్ 22 నటుడిగా నేను పుట్టినరోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేనిరోజు. దీనికి కారణమైన నా లక్షలాది మంది సోదరులు మరియు సోదరీమణుల అమూల్యమైన ప్రేమకు ధన్యవాదాలు” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here