ఆగస్టులో 16,208 పోస్టుల భర్తీకి రాత పరీక్షలు

Village/Ward Secretariat Exams Phase 2 in AP Likely to be Held in August 2nd week

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి ఆగస్టులో రాత పరీక్షలు జరగనున్నాయి. సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలకు ఆగస్టు 9 వ తేదీ నుంచి 14 వ తేదీవరకు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ నెల 28 లోగా పరీక్షా కేంద్రాల గుర్తింపు పక్రియ పూర్తవనుందని అధికారులు వెల్లడించారు.గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 19 రకాల పోస్టులకు సంబంధించి మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి గత జనవరిలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు నోటిఫికేషన్స్ జారీ చేయగా, 11.06 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించి, ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి ఇబ్బందులు లేకపోతే ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా ఆగస్టు నెలలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయా పరీక్షల ఫేజ్-2 ఆగస్టు రెండవవారంలో జరుగుతుందని, పూర్తిస్థాయి షెడ్యూల్ త్వరలోనే ప్రకటించబడుతుందని, దరఖాస్తుదారులందరూ తదనుగుణంగా సిద్ధం కావాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu